Begin typing your search above and press return to search.

ఎ ఎమ్ ర‌త్న‌మా...ఇది స‌త్య‌మా!

By:  Tupaki Desk   |   18 Nov 2015 3:30 PM GMT
ఎ ఎమ్ ర‌త్న‌మా...ఇది స‌త్య‌మా!
X
ఎ ఎమ్ ర‌త్నం గురించి వారి సంస్థ సూర్య మూవీస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు - త‌మిళ భాష‌ల్లో ఎంతో మంది స్టార్‌ హీరోల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు నిర్మించారు. అభిరుచి గ‌ల నిర్మాత‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి క్ర‌మంలో కొడుకుల‌తో సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నారు. బ‌య‌ట హీరోల‌తో తీసిన సినిమాలు కూడా పెద్డగా ఆడ‌క పోవ‌డంతో సూర్య మూవీస్ ఒక్క‌సారిగా న‌ష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. దీంతో చాలా కాలం ఎ ఎమ్ ర‌త్నం సినిమాల‌కు దూరం కావాల్సి వ‌చ్చింది. ఇలాంటి ఒక గొప్ప నిర్మాత మ‌రుగున ప‌డిపోవ‌డం స‌రైంది కాద‌ని....కెరీర్ మొద‌ట్లో సినిమా ఇచ్చి ప్రోత్స‌హించినందుకు కృత‌జ్క్ష‌త‌గా పిలి చి సినిమా సినిమా ఇచ్చాడు రియ‌ల్ హీరో అజిత్.

దీంతో రీ ఎంట్రీ ఆరంభం అయింది. సినిమా విడుద‌లై విజ‌యవంత‌మైంది. ఒక్క‌సారిగా ఎ ఎమ్ ర‌త్నం హ‌వా మొద‌లైంది. ఆ త‌రువాత (ఎన్నాయై అరిందాళ్‌) ఎంత‌వాడుగాని, ఇటీవ‌ల విడుద‌లైన వేద‌ళం ఈ మూడు చిత్రాలు కూడా స‌క్సెస్ కావ‌డంతో ఎ ఎమ్ ర‌త్నంకి మ‌ళ్లీ మునుప‌టి వైభ‌వం వ‌చ్చింది. ఆరంభం చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఎన్నాయై అరిందాళ్ చిత్రాన్ని కూడా ఎంత‌వాడుగాని పేరుతో తెలుగులో విడుద‌ల చేశారు. ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. అయితే ఈ యేడాది తెలుగులో గోపీచంద్‌ తో త‌న‌యుడు జ్యోతీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు వినికిడి. ఈ నెల‌లోనే షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉంటే కొడుకుల‌తో సినిమాలు చేసి చెయ్యి కాల్చుకున్న ర‌త్నం కొంచెం చేయి తిర‌గ‌క ముందే మ‌ళ్లీ వారితో సినిమా చేయ‌డం ఏ మాత్రం క‌ర‌క్ట్ కాదు. ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం వ‌స్తున్న త‌రుణంలో ఇలాంటి డెషిసన్ తీసుకున్నాడేంట‌ని అంద‌రూ అనుకుంటున్నార‌ట‌. కానీ ఎఎమ్ ర‌త్నం అవ‌న్నీ లెక్క చేయ‌ట్లేద‌ట‌. త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలిసే అవ‌కాశాలున్నాయి.