Begin typing your search above and press return to search.
భారతీయుడు తీసేందుకు 200 కోట్లు
By: Tupaki Desk | 14 Aug 2016 7:30 AM GMTస్వతంత్ర దినోత్సవం వస్తోంది. 69వ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాం. దేశభక్తి ఉప్పొంగే రోజు ఇది. దేశభక్తిపై చాలానే సినిమాలు వచ్చాయి. కానీ వాటన్నిటిలో భారతీయుడికి ప్రత్యేకత ఉంది. అటు దేశంలోని లంచగొండితనాన్ని ఇటు దేశభక్తిని రెండింటినీ సమపాళ్లలో రంగరించిన సినిమా భారతీయుడు. కమల్ హాసన్ లాంటి విశ్వ నటుడు.. శంకర్ లాంటి దర్శకుడు.. ఏఆర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్.. మంచి సినిమా కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడని నిర్మాత ఏఎం రత్నం.
ఓ సినిమా చరిత్ర సృష్టించేందుకు ఇంతకంటే ఏం కావాలి. భారతీయుడులో కమల్ కి మేకప్ వేసేందుకు రోజూ ఐదు గంటలు పట్టేది. తీరా ఆ మేకప్ ఉండేది రెండు గంటలు మాత్రమే. తీయడానికి మరో మూడు గంటల సమయం అవసరం. రీసెంట్ గా వచ్చిన బాహుబలికి పని చేసిన కమల్ కణ్ణన్ - శ్రీనివాస్ మోహన్ లు.. తమను ఈ స్థాయికి తెచ్చింది భారతీయుడు లాంటి చిత్రానే అని ఓపెన్ గానే చెప్పారు.
భారతీయుడును ఇప్పుడు తీయాలంటే రెండొందల కోట్లు కూడా చాలవంటున్నాడు నిర్మాత ఏఎం రత్నం. హిందీలో అతి ఎక్కువ వసూళ్లు సాధించిన సౌత్ డబ్బింగ్ సినిమా రికార్డు సుదీర్ఘ కాలం భారతీయుడు దగ్గరే ఉంది. ఈ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచన అప్పట్లోనే కమల్.. ఏఎం రత్నం దగ్గర ఉండగా.. రీసెంట్ గా దర్శకుడు శంకర్ కూడా ఆ ప్రతిపాదన తెచ్చాడట. పరిస్థితులు చూస్తుంటే.. సీక్వెల్ పట్టాలెక్కేట్లుగానే ఉంది.