Begin typing your search above and press return to search.
ఆ సినిమాలో అమల ఎలా చేరారంటే
By: Tupaki Desk | 2 Jan 2016 3:30 PM GMTఅక్కినేని అమల గత కొంతకాలంగా గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. నాగ్ తో పెళ్లి తర్వాత చాలాకాలంపాటు సినిమాలకు దూరమైన ఈమె.. ఇప్పుడు మాత్రం తరచుగా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు. అయితే అవన్నీ కేమియోలు మాత్రమే. పూర్తి స్థాయిలో కేరక్టర్స్ ను యాక్సెప్ట్ చేయడం లేదు.
ఆఫర్స్ వస్తున్నా కూడా.. ఫుల్ లెంగ్త్ రోల్స్ కు సిద్ధంగా లేనంటున్నారు అమల. దీనికి కారణం తన ఇతర పనుల్లో బిజీగా ఉండడమే అంటున్నారామె. ఈ 47 ఏళ్ల మాజీ హీరోయిన్.. ఇప్పుడు అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియాకు హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతే కాదు.. సహజంగా జంతు ప్రేమికురాలు అయిన ఈమె, బ్లూక్రాస్ హైద్రాబాద్ కు సహ వ్యవస్థాపకురాలు. ఈ సంస్థల్లో బాస్ స్టేజ్ లో ఉన్న తనకు.. నటనపై పూర్తిగా దృష్టి పెట్టే సమయం లేదని అంటున్నారు. అయితే.. ఇలా కేమియో రోల్స్ మాత్రం చేస్తానని, సినిమా, మీడియాపై అప్ డేటెడ్ గా ఉండేందుకు ఇది ఉపయోగపడ్తుందని చెప్పారామె. అలాగే.. రీసెంట్ గా కమల్ హాసన్ నుంచి కాల్ వచ్చిందని, ఇంకా నటిస్తున్నావా అని అడిగితే.. కేవలం కేమియోస్ చేస్తున్నట్లు చెప్పారట.
మళయాళీ దర్శకుడు రాజీవ్ కుమార్ ను పంపి.. స్టోరీ గురించి, ఇందులో తన రోల్ గురించి వివరంగా చెప్పించారట కమల్. తన పాత్ర తీరుకు ముగ్ధురాలై.. కమల్ సినిమాలో చేసేందుకు ఒప్పుకున్నానని అన్నారు అమల. ఎక్కువభాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం.. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. కమల్ ప్రాజెక్టులో భాగం అయినందుకు హ్యాపీ అంటున్నారు అక్కినేని అమల.