Begin typing your search above and press return to search.
కథకి కనెక్ట్ అవుతారు .. కన్నీళ్లు పెట్టుకుంటారు: అమల
By: Tupaki Desk | 8 Sep 2022 3:15 AM GMTఇటు టాలీవుడ్ లోను .. అటు కోలీవుడ్ లోను స్టార్ హీరోయిన్ అనిపించుకున్న అమల, వివాహం తరువాత సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. చాలా గ్యాప్ తరువాత 'మనం' .. ' లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలలో ఆమె కనిపించారు.
అలాంటి అమల ఆ తరువాత చేసిన సినిమా 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమాలో అమల పోషించిన పాత్ర చాలా కీలకం. హీరో కి తల్లి పాత్రలో ఆమె కనిపిస్తారు. కథ అంతా కూడా ఆమె పాత్ర ప్రధానంగానే సాగుతుంది. అలాంటి ఈ సినిమా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది.
ఈ వేదికపై అమల మాట్లాడుతూ .. "అందరికీ నమస్కారం .. 'ఒకే ఒక జీవితం' మంచి సినిమా. అలాంటి ఈ సినిమాలో నటించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం. ఈ సినిమా చేసినవారిలో అన్ని రాష్ట్రాలకి చెందినవారు ఉన్నారు. కేరళ నుంచి .. తమిళనాడు .. నార్త్ ఇండియా నుంచి వచ్చినవారున్నారు. దర్శకుడు శ్రీ కార్తీక్ మాత్రం తెలుగు అబ్బాయే.
ఇక నా విషయానికి వస్తే, ఎక్కడో బెంగాల్లో ఐరిష్ మదర్ కి పుట్టాను. అలాంటి నన్ను తెలుగింటి కోడలిగా స్వీకరించి తెలుగు నేర్పించారు. అలాంటి నాకు ఈ సినిమాలో చేసే అవకాశం రావడం గర్వంగా ఉంది.
'ఒకే ఒక జీవితం' అందమైన .. అద్భుతమైన సినిమా. అందరికీ నచ్చుతుందనే నమ్మకం నాకు ఉంది. ఈ నెల 9 నుంచి ఈ సినిమా థియేటర్స్ లో ఉంటుంది. మీరంతా కూడా మీ ఫ్యామిలీతో పాటు ఈ సినిమాను చూడండి.ఈ సినిమా చూస్తున్నంత సేపు మీరు డీప్ ఎమోషన్స్ కి లోనవుతారు. బాధగా అనిపిస్తే దానిని పిట్టలా వదిలేయండి. సంతోషంగా అనిపిస్తే స్వీకరించండి. మా వైపు నుంచి మాత్రం ఒక మాట నమ్మకంగా చెబుతున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది .. మీరంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు" అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన రీతూ వర్మ మాట్లాడుతూ .. "నిన్న జరిగిన స్క్రీనింగులో ఈ సినిమాను ఫస్టు టైమ్ చుశాను. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇలాంటి ఒక సినిమాలో నేను భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను.
శ్రీ కార్తీక్ ఈ సినిమాను చాలా గొప్పగా చిత్రీకరించాడు. ఈ విషయాన్ని ఈ సినిమా హీరోయిన్ గా కాకుండా ఒక ఫ్రెండ్ గా చెబుతున్నాను. అమలగారితో .. శర్వానంద్ గారితో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్లిద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా శర్వానంద్ కి ఎన్నో అవార్డులను తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.