Begin typing your search above and press return to search.

తల్లిదండ్రుల విషయంలో క్లారిటీ ఇచ్చిన అమల

By:  Tupaki Desk   |   14 Sep 2019 11:58 AM GMT
తల్లిదండ్రుల విషయంలో క్లారిటీ ఇచ్చిన అమల
X
దేశ పరిస్థితుల్లో వస్తున్న కొన్ని మార్పుల వల్ల విదేశీ మూలాలు ఉన్నవారు తమ దేశ భక్తి ని నిరూపించుకునే విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా జాతీయవాదం అనే పదానికి కొత్త అర్థాలు తీస్తుండడంతో ఫారెన్ రూట్స్ కలవారికి ఇబ్బంది ఎదురవుతోంది. మరి అమల అక్కినేనికి ఈ విషయంలో ఎక్కడైనా ఇబ్బంది ఎదురైందేమో తెలీదు కానీ ఆమె తన పేరెంట్స్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

అమల తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమ్మగారు నాన్నగార్ల ఫోటోలు పోస్ట్ చేసి "నా పేరెంట్స్ గురించి కొని అసత్య కథనాలు వస్తున్నాయి. అందుకే వివరణ ఇస్తున్నాను. మా అమ్మగారు ఐరిష్ మహిళ. అయితే చాలామంది భారతీయులకంటే మా అమ్మ నిజమైన భారతీయురాలిగా ఉంటుందని మా అత్తగారు అనేవారు. మా నాన్నగారు భారతీయుడు. ఉత్తర ప్రదేశ్ లో పెరిగారు భారతీయ నౌకాదళంలో పని చేశారు. ఆయన పుట్టింది మాత్రం ఈస్ట్ బెంగాల్ లోని ఢాకా. ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ గా మారక ముందు సంగతి ఇది. ఎవరైనా చరిత్రను అర్థం చేసుకోకపోతే.. వారికి ఎప్పటికీ దేశ విభజన వల్ల కలిగిన నష్టం.. బాధ తెలియవు. కమాండర్ MK ముఖర్జీ ఒక భారతీయుడు.. బెంగాలి" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించిన అమల అక్కినేని నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత నటనకు దూరంగా ఉంటున్నారు. బ్లూ క్రాస్ తరఫున యానిమల్ రైట్స్ కోసం తన గళం వినిపిస్తూ ఉంటారు. చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో నటించడం ద్వారా నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు.