Begin typing your search above and press return to search.

'వర్కౌట్'తోనే ఫిట్ నెస్ అంటున్న స్టార్ హీరో వైఫ్

By:  Tupaki Desk   |   22 April 2020 1:00 PM GMT
వర్కౌట్తోనే ఫిట్ నెస్ అంటున్న స్టార్ హీరో వైఫ్
X
ఒకప్పటి టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌, కింగ్ నాగార్జున సతీమణి అమల. చాలా కాలంగా సినిమాలకు దూరంగా సోషల్‌ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఎప్పుడు సామాజిక కార్యక్రమాలతో బిజీగా ఉండే అమల ఇటీవల అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో శర్వాకు తల్లిగా నటిస్తున్నారు అమల. తల్లి పాత్రలో కనిపిస్తున్నా ఫిట్‌నెస్‌ విషయంలో ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా తన వర్క్‌అవుట్‌కు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేశారు అమల. ఆ వీడియోలో స్టాండింగ్ ప్రెస్ (25-కిలో అప్పర్ బాడీ వర్కౌట్) మరియు ఒలింపిక్ స్క్వాట్ (57 కిలోల లోయర్ బాడీ వర్కౌట్) చేసారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో మహిళలు భుజాలు, వెన్నెముక స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇలా చేయాలనీ సూచించారు. మహిళలు బలంగా ఉండరని ఎవరన్నారు? స్ట్రాంగ్‌ బాడీ - స్ట్రాంగ్‌ మైండ్‌ అందరూ స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్తున్నారు. 52యేళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో కుర్ర హీరోయిన్లకు ధీటుగా నిలుస్తున్నారు. నాగార్జున ఇంట్లో అందరూ ఫిట్‌నెస్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో నాగార్జునతో పాటు నాగచైతన్య - అఖిల్‌ - సమంతలు కూడా తమ వర్క్‌ వీడియోస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. అయితే అమల వర్క్‌ అవుట్‌ వీడియోను పోస్ట్ చేయటం మాత్రం చాలా అరుదు. ప్రస్తుతం శర్వానంద్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమల - ఇటీవల ఓటీటీ ప్లాట్‌ ఫాం జీ5 లో రిలీజ్‌ అయిన హై ప్రీస్ట్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించారు.