Begin typing your search above and press return to search.

అమ్మ పాత్ర‌లో అమ‌ల ఓ అద్భుతం!

By:  Tupaki Desk   |   11 Sep 2022 7:44 AM GMT
అమ్మ పాత్ర‌లో అమ‌ల ఓ అద్భుతం!
X
వెండి తెర‌పై అమ్మ పాత్ర ఎవ‌రు పోషించిన అంద‌మే. కానీ ఆ అందం అద్భుతం అవ్వాలంటే? పాత్ర గొప్ప‌త‌నంతో పాటు ఫేం కూడా కీల‌కమే. అమ్మ పాత్ర‌లు ప్ర‌తీ సినిమాలో స‌హ‌జంగా క‌నిపించేవే. కానీ ప్ర‌త్యేకంగా మామ్ రోల్స్ ని అద్భుతంగా చూపించాల్సిన క‌థ‌లు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమా పాత్ర‌ల‌కి కొంత మంది న‌టులే ప‌ర్పెక్ట్ గా సూట‌వుతారు.

వాళ్లు మాత్రమే న్యాయం చేయ‌గ‌ల్గుతారు అనిపిస్తుంది. ఇటీవ‌లి కాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో అలాంటి రోల్ ఏదైనా ఉంది? అంటే క‌చ్చితంగా అక్కినేని అమ‌ల గురించి మాట్లాడుకోవాల్సిందే. అవును శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన `ఒకే ఒక్క జీవితం`లో అమ‌ల శ‌ర్వాకి అమ్మ పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. టైం ట్రావెల్ నేప‌థ్యంతో సాగిన చిత్రం మంచి స‌క్సెస్ అయింది.

ఇందులో శ‌ర్వానంద్..ప్రియ‌ద‌ర్శి...వెన్నెల కిషోర్ పాత్ర‌ల‌తో పాటు....శ‌ర్వా త‌ల్లిదండ్రుల పాత్ర‌కు చాలా ప్రాధాన్య‌త క‌నిన‌పిస్తుంది. అందులోనూ మామ్ రోల్ పోషించిన‌ అమ‌ల పాత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. అమ్మ పాత్ర‌లో అమ‌ల ఒదిగిపో్యారు. పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసారు. ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌ల న‌టిగా చాలా సినిమాలు చేసారు.

కానీ ఈ సినిమాలో మామ్ రోల్ మాత్రం ఎప్ప‌టికీ మర్చిపోలేని పాత్ర‌గా ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. కుట్లు త‌ల్లిగా అమ‌ల అభిన‌యించిన తీరు ప్ర‌శంస‌నీయం. తెర‌పై అమ్మ పాత్ర‌ని ఇంత అందంగా చూపించవ‌చ్చా? అన్న భావ‌న కల్గింది. ద‌ర్శ‌కుడు శ్రీకార్తిక్ ఆ పాత్ర‌ను అంత అందంగా..అద్భుతంగా రాసుకోవ‌డంతోనే అది సాధ్య‌మైంది.

సాధార‌ణంగా మామ్-స‌న్ రోల్ ని హాస్యాస్ప‌దంగా మ‌లిస్తేనే క‌మ‌ర్శియ‌ల్ పంథాలో వ‌ర్కౌట్ అవుతుంది . మ‌రీ సెంటిమెంట్ జొప్పిస్తే బోరింగ్ అనిపిస్తుంది. కానీ అమ‌ల‌-శ‌ర్వా మ‌ధ్య స‌న్నివేశాలు సెంటిమెంట్ తోనే ఎంతో హృద్యంగా మ‌లిచి సినిమా స‌క్సెస్ లో భాగం చేసారు. ఇది కేవ‌లం ద‌ర్శ‌కుడి విజ‌న్ తోనే అది సాధ్య‌మైంది. మామ్ పాత్ర‌ అమ‌ల‌ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన‌ట్లే క‌నిపిస్తుంది. ఇవ‌న్ని కింగ్ నాగార్జున‌పై సైతం ఎంతో బ‌లంగా ప‌నిచేసాయ‌ని చెప్పొచ్చు.

బ‌హుశా నాగ్ అందుకేనేమో ప్రీమియ‌ర్ అనంత‌రం క‌న్నీళ్లు చెమ‌ర్చారు. ఓసినిమా చూసి ఇలా కంట నీళ్లు తెచ్చుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. తెర‌పై ఆ పాత్ర‌ల ప్ర‌భావం రియ‌ల్ లైఫ్ లో చూస్తే త‌ప్ప అంత‌టి ప్ర‌భావితం చెంద‌డం క‌ష్టం. వాట‌న్నింటిని ద‌ర్శ‌కుడు ఎంతో తెలివిగా ఎగ్జిక్యూట్ చేసి ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేసాడు. ఇక‌పై అమ్మ‌ పాత్ర‌లంటే? ద‌ర్శ‌కులంద‌రికీ అమ‌ల మాత్ర‌మే గుర్తుకొస్తారేమే. ఏది ఏమైనా ? అమ‌ల కెరీర్ లో మాత్రం నిలిచిపోయే గొప్ప పాత్ర‌గా చెప్పొచ్చు.