Begin typing your search above and press return to search.

అమలా పాల్ విజయ్ కు షాకిచ్చినట్లా?

By:  Tupaki Desk   |   26 Aug 2016 8:44 AM GMT
అమలా పాల్ విజయ్ కు షాకిచ్చినట్లా?
X
విడాకుల వ్యవహారంతో ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన హీరోయిన్ అమలాపాల్. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు, గుట్టుచప్పుడు కాకుండా సంసారం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్న దశలో విడాకులకు అప్లై చేసుకుని సంచలనం సృషిటించింది విజయ్ - అమలాపాల్ జంట. ఈ విషయంలో వీరి విడాకులకు కారణాలు ఇవి అంటూ రకరకాల పుకార్లు వినిపించినా... వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటించడం అనే అంశంపైనే ఎక్కువ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో విజయ్ తండ్రి తమిళంలో పెద్ద నిర్మాత కావడం వల్ల ఎందుకొచ్చిన తంట అని.. అమలాపాల్ పై అనధికారిక బ్యాన్ విదించారనే వార్తకు కూడా అప్పట్లో వచ్చాయి.

అయితే అమలాపాల్ కు ఎవ్వరూ ఛాన్సులు ఇవ్వడం లేదనే వార్తలు వస్తున్నప్పుడు.. ఒక కన్నడ సినిమాకు సైన్ చేసి షాక్ ఇచ్చింది. అక్కడితో ఆగని అమల మరోసారి భర్త విజయ్‌ తో పాటు చాలా మందికి దిమ్మతిరిగే పని చేసింది. తమిళ హీరో విజయ్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌ గా అమలా ఎంపికైనట్లు అప్పట్లో కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. అయితే.. ఈ సినిమాకు దర్శకత్వం వహించేది అమలాపాల్ భర్త విజయ్ అనితెలిసింది. ఈ క్రమంలో దర్శకుడు విజయ్ - హీరో విజయ్‌ లు చేస్తున్న ఈ సినిమాకి నిర్మాతలు హీరోయిన్‌ గా అమలాను తీసుకుందామనుకున్నారట. ఈ ప్రపోజల్‌ కు అమలా ఒప్పుకోదులే అనుకొని డైరెక్టర్ విజయ్‌ ఈ సినిమాకి ఒప్పుకున్నాడట. అయితే అంతా ఓకే అయిన తర్వాత ఈ సినిమాకు తానుకూడా ఒప్పుకొని అమలా షాక్ ఇచ్చింది. దీంతో సినిమాల్లో నటించడం అనే అంశంపై విడాకులు తీసుకుంటున్నారో.. అదే విషయంపై ఇప్పుడు వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. ఇది కచ్చితంగా అమలాపాల్ విజయ్ కు ఇచ్చిన షాక్ గానే తమిళ సినీజనాలు భావిస్తున్నారట!!