Begin typing your search above and press return to search.

వీఐపీతో రెండోసారి అమ‌ల‌

By:  Tupaki Desk   |   26 Nov 2015 5:37 AM GMT
వీఐపీతో రెండోసారి అమ‌ల‌
X
వేలై ఇళ్ల ప‌ట్టాధారి (వీఐపీ) సినిమాతో జోడీగా ఆక‌ట్టుకున్నారు ధ‌నుష్‌- అమ‌లాపాల్‌. ఆ సినిమా తెలుగులో ర‌ఘువ‌ర‌ణ్ బిటెక్ పేరుతో రిలీజై పెద్ద విజ‌యం సాధించింది. ఈ జంట మ‌రోసారి జోడీగా న‌టించేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ హిట్ సినిమా `నిల్ బ్యాట‌రీ స‌న్న‌ట‌` త‌మిళ రీమేక్‌ లో ఈ జోడీ క‌లిసి న‌టిస్తున్నారు.

ఒరిజిన‌ల్‌ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అశ్విన్ అయ్య‌ర్ తివారి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం విశేషం. ఆనంద్ రాయ్ (నిర్మాత‌)తో క‌లిసి ధ‌నుష్ బాలీవుడ్‌ లో రాంజానా సినిమాని నిర్మించాడు. ఇప్పుడు మ‌రోసారి ఈ ఇద్ద‌రూ క‌లిసి తాజా చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. అయితే ఈ మూవీలో అమ‌లాపాల్ క్యారెక్ట‌ర్ ఇంట్రెస్టింగ్. మూవీ క‌థాంశం కూడా వెరీ ఇంట్ర‌స్టింగ్‌. త‌న కూతురు అందివ‌చ్చిన అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటూ ఎదిగేందుకు భ‌ర్త‌ను కోల్పోయిన‌ ఓ సింగిల్ మ‌ద‌ర్ ఎలాంటి సాయం చేసింది అన్న‌దే సినిమా. త‌ల్లి పాత్ర‌లో రేవ‌తి న‌టిస్తున్నారు. కూతురిగా అమ‌లాపాల్ న‌టించ‌నుంది.

అమ‌లాపాల్ - ధ‌నుష్ జోడీ వీఐపీ మూవీలో పెర్ఫెక్ట్ పెయిర్‌ గా క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి ఈ ఇద్ద‌రూ ఆన్‌ స్ర్కీన్ వండ‌ర్స్ క్రియేట్ చేస్తార‌ని అభిమానులు భావిస్తున్నారు. హిట్ పెయిర్ రిపీట‌వుతోంది అంటే చాలా అంచ‌నాలే ఉంటాయి. వాటిని అందుకుంటార‌నే ఆశిద్దాం. అమ‌ల న‌టించిన ప‌సంగ 2 ఇంకా రిలీజ్‌ కి రావాల్సి ఉంది.