Begin typing your search above and press return to search.
ఎక్స్ హబ్బీపై అమలాపాల్ కామెంట్
By: Tupaki Desk | 15 July 2019 5:09 AM GMTఆమె (ఆడై) సినిమాతో వివాదాలకు కేంద్రబిందువు అయ్యింది అమలాపాల్. ఈ చిత్రానికి వివాదంతో ప్రచారం కలిసొస్తోంది. వెస్ట్రన్ కల్చర్ కి నిలువెత్తు రూపంగా ఈ సినిమాలో అమలా పాల్ పాత్రను తీర్చిదిద్దారు దర్శకుడు రత్నకుమార్. ఆమె టీజర్ చూశాక .. బ్యాచిలర్ పార్టీలో నగ్నంగా నటించిన అమలాపాల్ తెగువ గురించి యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. అమలాపాల్ బోల్డ్ యాక్ట్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోవైపు టీవీ చానెళ్లలో అమలాపాల్ ఇంటర్వ్యూలు అంతే వేడెక్కిస్తున్నాయి.
తాజాగా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మాజీ భర్త ఏ.ఎల్.విజయ్ టాపిక్ తెరపైకి వచ్చింది. అమలాపాల్ కి విడాకులు ఇచ్చిన విజయ్ ఇటీవలే చెన్నయ్ కి చెందిన డాక్టర్ ఐశ్వర్యను పెళ్లాడారు. ఇదే విషయాన్ని అమలాపాల్ వద్ద ప్రస్థావిస్తే దానిపై ఆసక్తికరమైన రిప్లయ్ ఇచ్చింది. ``విజయ్ చాలా స్వీట్ మ్యాన్. ఫెంటాస్టిక్ హ్యూమన్. మనస్ఫూర్తిగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నా. ఎక్కువమంది పిల్లల్ని కని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా`` అని అంది.
విడాకుల తర్వాత తనకు అవకాశాలు రావడంపైనా అమలా ఆసక్తికర కామెంట్ చేసింది. తనకు వరుసగా ఇలాంటి అవకాశాలొస్తుంటే ఎంతో భయపడుతున్నానని నవ్వేస్తూ తెలిపింది. ఏవో అక్క చెల్లి పాత్రలు లేదా ఫ్రెండు పాత్రల్లో అవకాశాలొస్తాయని అనుకున్నా. బతుకు తెరువు కోసం టీవీ సీరియళ్లలోనూ నటించాల్సొస్తుందేమోనని భయపడ్డాను. అసలు ట్యాలెంట్ ఉంటే అవకాశాలకు కొదవేమీ ఉండదని నా విషయంలో ప్రూవైంది అని కాన్ఫిడెన్స్ ని అమలాపాల్ వ్యక్తం చేసింది.
`నాన్న` సెట్స్ లో ఉన్నప్పుడు దర్శకుడు విజయ్ ప్రేమలో పడిన అమలా 2014లో పెళ్లి చేసుకుంది. 2017లో కలతల వల్ల ఈ జంట విడిపోయారు. వాస్తవానికి విడాకుల సమయంలో ఎమోషన్ లో విజయ్ పై రకరకాలుగా ఆరోపించిన అమలాపాల్ ఇప్పుడు మనసు మార్చుకుని నిజాయితీగానే అతడి రెండో పెళ్లిని స్వగతించిందా? అప్పుడు అన్ని మాటలని ఇప్పుడేమో సో స్వీట్ అంటుందా? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోవైపు కెరీర్ గురించి ముచ్చటిస్తూ .. టీవీ సీరియళ్లు చేయాల్సొచ్చిందేమో! అంటూ టీవీ ఇండస్ట్రీనే తక్కువ చేస్తూ తూలనాడింది మ్యాడమ్.