Begin typing your search above and press return to search.
అమల ముద్దెట్టింది బెస్టు ఫ్రెండుకేలే!!
By: Tupaki Desk | 14 Feb 2017 12:43 PM GMTఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా.. 'మొన్ననే డైవర్స్ అయ్యింది. అప్పుడే అమలా పాల్ ఎవరికో ముద్దెట్టేస్తోంది' అంటూ నానా రచ్చ చేస్తున్నారు. అసలు మనలో మన మాట.. డైవర్స్ అయితే ఇక ఆ అమ్మాయి వేరే వారితో ప్రేమలో పడకూడదా? అయినాసరే ఇక్కడ అలాంటిదే లేదులే సుమీ. పదండీ అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం.
కేరళలో పుట్టి పెరిగిన అమలకు అక్కడ చాలామంది ప్రాణ స్నేహితులు ఉంటారు కదా.. ఆ బ్యాచ్ లో అజిత్ నాయర్ అనే స్నేహితుడు కూడా ఉన్నాడు. ఇతగాడికి మొన్ననే పెళ్ళి ఫిక్స్ అయ్యింది. కంగ్రాట్స్ రా బడ్డీ అంటూ తన స్టయిల్లో చెబుతూ.. అమల ఆ బాబుకు అలా బుగ్గ మీద ఒక ముద్దిచ్చింది. అతగాడు ఆ తరువాత తను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడులే. ఈ పెళ్ళిలో అమల కూడా తను స్వతాహాగా క్రిస్టియన్ అయినప్పటికీ.. చక్కగా పట్టుచీర కట్టుకొని నుదుటను బొట్టెట్టుకుని.. భలే సందడి చేసింది. ఇదంతా తెలుసుకోకుండా.. అమలు ఎవరికో ముద్దెట్టేసింది ముద్దెట్టేసేసింది బాబోయ్ అంటూ హడావుడి ఎందుకు మాష్టారూ?
ఇకపోతే స్వయంగా వాలెంటైన్స్ డే నాడు ఇలాంటి ఫోటోలను సర్కులేట్ చేస్తూ.. ప్రాణ స్నేహితుల మధ్య లేనిపోని రిలేషన్ ఆపాదించడం అన్యాయం అంటూ అమలా పాల్ స్నేహితులు.. అభిమానులూ వాపోతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/