Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: బీచ్ లో బ్యూటిఫుల్ స్టూడెంట్!
By: Tupaki Desk | 11 March 2019 10:34 AM GMTకేరళ బ్యూటీ అమలా పాల్ పేరు తెలియని సినిప్రేమికులు దాదాపుగా సౌత్ లో ఉండరు. జస్ట్ సినిమాలు అయితే ఆమెకు అంత పాపులారిటీ వచ్చి ఉండేది కాదు. సినిమాలతో పాటుగా వివాదాలతో కూడా సావాసం చేయడం అమలకు మంచి నీళ్ళు తాగడం లాంటిది. డైరెక్టర్ AL విజయ్ తో ప్రేమ వివాహం.. అ తర్వాత గొడవలు - విడాకులు.. లగ్జరీ కారు టాక్స్ ఎగవేత ఆరోపణలు.. ఒక తమిళ హీరో తో ఎఫైర్ రూమర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. అందుకే అమలా చాలా పాపులర్.
ఈ పాపులారిటీకి తోడుగా అమల సోషల్ మీడియాలో మహా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ప్రశ్న ఏదైనా సమాధానం మాత్రం బీచ్. స్కూల్ కు మళ్ళీ వచ్చా. ఈసారి సర్ఫింగ్ స్కూల్. సర్ఫింగ్ నేర్చుకుంటున్నా" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. సర్ఫింగ్ అంటే తెలుసు కదా.. సముద్రపు అలలపై ఒక పొడవాటి ప్లాస్టిక్ సర్ఫ్ బోర్డ్ పై నిలబడి విన్యాసాలు చేయడం. ఈ గేమ్ కోసం దాదాపుగా ఎవరైనా బికినీయే వేసుకుంటారు. తప్పు పట్టలేం. కానీ అమల స్పైసీ బ్యూటీ కాబట్టి తడి అందాలతో తీరైన ఒంపుసొంపులతో నెటిజనులకు కాస్త ఘాటుగా కనిపిస్తోందంతే. ఇంకేం లేదు.
అందుకే చాలామంది నెటిజనులు ఎన్నో ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. ఒకరు "అందమైన జలకన్య' అన్నారు. ఒకరు మలయాళం లో పెద్ద కామెంట్ పెట్టారు. ఆ నెటిజనుడి మలయాళం ఆత్మఘోష మనకు అర్థం కావాలంటే మనకు ఆ భాష చదవడం రావాలి కదా? అది సరే.. మరో నాటీ నెటిజనుడు "ఫోటోగ్రాఫార్ ధనుషా?" అన్నారు. ఆయన అలానే ఎందుకు అడిగారని మీరు మళ్ళీ అడక్కండి. కొన్నిటికి ఎక్కువగా వివరాలు అందించలేం.. అర్థం చేసుకోరూ!