Begin typing your search above and press return to search.

అమ్మాయిలందరికీ అమల విలనిజం

By:  Tupaki Desk   |   23 March 2018 4:29 PM IST
అమ్మాయిలందరికీ అమల విలనిజం
X
హీరోయిన్స్ క్లిక్ అయితే వారిని ఆపడం ఎవరి తరం కాదు. వరుసగా గ్లామర్ తో హిట్స్ అందుకుంటే రెమ్యునరేషన్ అడిగినంత ఇవ్వక తప్పదు. హీరోలు ఏడాదిలో ఒక సినిమా చేస్తే హీరోయిన్స్ నాలుగ సినిమాల్లో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక్క హిట్టు మహిమ కెరీర్ నే మార్చేస్తుంది. ఆ విధంగా ప్రస్తుతం సౌత్ లో ఆగకుండా పరిగెడుతోన్న ముద్దుగుమ్మ అమల పాల్. కథ మరియు అందులో పాత్ర నచ్చితే చాలు అమలా వేంటనే ఒకే చెప్పేస్తోంది.

గత కొంత కాలంగా రిజల్ట్ తో సంబంధం లేకుండా అమలా అవకాశాలను అందుకుంటోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ బ్యూటీ చేతులో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అంతే కాకుండా ఈ మధ్య ఒక థ్రిల్లర్ కథను ఒకే చేసింది. అందులో ఇంతకుముందే నలుగురు హీరోయిన్స్ ని సెలెక్ట్ చేశారు. ఐదవ లేడీగా అమలా పాల్ కనిపించనుంది. ఐదవ స్థానం అంటే ఎదో గెస్ట్ రోల్ అనుకోకండి. సినిమాలో ఆ పాత్రే హైలెట్ అని తెలుస్తోంది.

ఎందుకంటే పూర్తిగా విలన్ పాత్రలో కనిపిస్తుందట. 1950 కాలంలో ఆ పాత్ర కొనగుతుందని సమాచారం. నందితా శ్వేతా - అదితి ఆర్య అలాగే శ్రద్ధా శ్రీనాథ్ మరియు అనీషా అంబ్రోసే వంటి హాట్ బ్యూటీలు సినిమాలో హీరోయిన్స్ గా నటించబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ నిజర్ షఫీ మొదటి సారి దర్శకత్వం వైపు అడుగులు వేయనున్నాడు. అతను ఇంతకుముందు మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ - మహానుభావుడు వంటి సినిమాలకు సినిమాటోగ్రఫీని అందించాడు.