Begin typing your search above and press return to search.
నచ్చినట్టే బతకనివ్వండి -అమలాపాల్
By: Tupaki Desk | 16 Aug 2015 4:15 AM GMTస్వాతంత్య్రం వచ్చి 69 వసంతాలైంది. ఇంతకాలం మహిళ ఏం సాధించింది? స్వేచ్ఛగా, స్వాతంత్య్రంగా బతుకుతోందా? బతకండి, బతకనివ్వండి. ఆడాళ్లను జీవించాలనుకున్నట్టే జీవించనివ్వండి. వారి స్వేచ్చకు అడ్డు చెప్పొద్దు. ఉన్నత శిఖరాలకు చేరాలనుకుంటే చేరనివ్వండి. ఇన్నేళ్ల స్వాతంత్య్ర ఫలాల్ని అందుకోనివ్వండి.. ఈ మాటలన్నది ఎవరో తెలుసా? .. శ్రీమతి అమలాపాల్. దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ని పెళ్లాడాక అమలాపాల్ ఎంతో ఎగ్జయిటింగ్ లైఫ్ ని ఆస్వాధిస్తోంది.
నా జీవితంలో ముగ్గురికి థాంక్స్ చెప్పాలి. నా ఫాదర్, బ్రదర్, నా హజ్బెండ్ ఈ ముగ్గురిని ఎప్పటికీ మర్చిపోలేను.. అంటూ ఎంతో ఉద్వేగంగా మాట్లాడింది. ఆడాళ్లకు ఇప్పటికీ స్వాతంత్య్రం లేదు. వారికి స్వేచ్ఛనివ్వడమే స్వాతంత్య్రం. వాళ్లలోని శక్తి సామార్థ్యాల్ని గుర్తించి ప్రోత్సాహం ఇవ్వండి. ఇది కనీస బాధ్యత.. అంటూ తన మనసులోని మాటను బైటికి చెప్పింది. అమలాపాల్ మాటని గౌరవిద్దాం. పరిశ్రమ ఏదైనా, అన్నిచోట్లా ఆడాళ్లకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అవసరం. అణచివేత ధోరణి తగదని అందరూ గుర్తించాలి.