Begin typing your search above and press return to search.

షూటింగ్ లో గాయపడ్డ అమలా పాల్

By:  Tupaki Desk   |   15 Aug 2018 7:10 AM GMT
షూటింగ్ లో గాయపడ్డ అమలా పాల్
X

ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తలకెక్కే సౌత్ భామ అమలా పాల్. సినిమాల విషయంలో కాకుండా ఇతర విషయాల్లో కూడా ఆమె తరచుగా హెడ్లైన్స్ లో నిలుస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం అలాంటి కాంట్రవర్షియల్ న్యూస్ కాదు. రీసెంట్ గా అమల షూటింగ్లో గాయపడింది. రిస్కీ స్టంట్ చేస్తుంటే చేతికి గాయమైందట.

విషయంలోకి వెళ్తే.. అమల 'అదో అంద పారవై పోల' అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదొక హారర్ థ్రిల్లర్ ఫిలిం. ఇందులో అమల పాత్ర కొన్ని రిస్కీ స్టంట్లు చేయాల్సి ఉందట. కానీ ఆమె ఆ స్టంట్ లు డూప్ ద్వారా చేసేందుకు ఒప్పుకోకుండా తనే స్వయంగా చేస్తోందట. అలా ఒక డేర్ డెవిల్ స్టంట్ చేస్తున్న సమయంలో తన కుడి చేయి మణికట్టు మెలిబడి గాయం అయిందట. కానీ అదేదీ పట్టించుకోకుండా సీన్ కంప్లీట్ చేద్దామని చెప్పిందట. కానీ ఫిలిం యూనిట్ మాత్రం అలా ఒప్పుకోకుండా వెంటనే ఆ సినిమా షూటింగ్ జరుగున్న కొచ్చిలో ని ఒక హాస్పిటల్ లో చేర్పించారట.

ఇదిలా ఉంటే, అమల మాత్రం ఎప్పుడెప్పుడు షూటింగ్ లొకేషన్ కి వెళ్లి పెండింగ్ షూటింగ్ కంప్లీట్ చేద్దామా అనే ఆలోచనలో ఉందట. యాక్టర్స్ అందరూ ఇంత తపనతో ఉంటే, దర్శకులకు నిర్మాతలకు వేరే ఇబ్బందులేముంటాయి?