Begin typing your search above and press return to search.

అమ్మ‌డి ట్వీట్ మాట‌లు రీల్ క‌థ‌.. రియ‌లా?

By:  Tupaki Desk   |   3 July 2019 4:57 AM GMT
అమ్మ‌డి ట్వీట్ మాట‌లు రీల్ క‌థ‌.. రియ‌లా?
X
అందానికి అందం.. అభిన‌యానికి ఏ మాత్రం ఢోకా లేని అమ‌లాపాల్ ప్ర‌స్తుతం ఇబ్బందిక‌ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కోరి పెళ్లాడిన ద‌ర్వ‌కుడు ఏఎల్ విజ‌య్ తో విడిపోయిన త‌ర్వాత నుంచి ఆమెకు కాలం.. ప‌రిస్థితులు క‌లిసి రావ‌టం లేదు. ఆమె ఏం చేసినా ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి.

అదే స‌మ‌యంలో అవ‌కాశాలు అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్నాయి. ఒక‌వేళ ఒక‌ట్రెండు ఛాన్స్ లు వ‌చ్చినా.. ఇట్టే చేజారిపోతున్న ప‌రిస్థితి. ఆమెను ఓకే చేసి.. అంత‌లోనే తమ నిర్ణ‌యాన్ని మార్చుకొని వేరే వారికి అవ‌కాశాలు ఇస్తున్న ప‌రిస్థితి. దీంతో.. ఆమె త‌న స్థాయిని త‌గ్గించుకొని చిన్న బ‌డ్జెట్ సినిమాల్లో న‌టించేందుకు సైతం ఓకే చెప్పేస్తున్నారు. త‌న టాలెంట్ తో మ‌రోసారి భారీ ఎత్తున అవ‌కాశాల్ని సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా ప‌రిస్థితులు మాత్రం అందుకు అనుకూలించ‌టం లేదంటున్నారు.

ప్ర‌స్తుతం ఆమె ఆడై మూవీలో న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసంఅందాల ఆర‌బోత విష‌యంలో ఎలాంటి ప‌ట్టింపుల‌కు పోలేద‌ని చెబుతున్నారు. అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోవ‌టంతో ఆమె తెగ ఫీలైపోతున్నార‌ట‌. ఇదిలా ఉంటే.. తాను విడిపోయిన మాజీ భ‌ర్త తాజాగా మ‌రో పెళ్లి చేసుకుంటున్నట్లు అనౌన్స్ చేయ‌టం ఒక ఎత్తు అయితే.. తాను కెరీర్ విష‌యంలో ఎదుర‌వుతున్న అడ్డంకుల్ని అధిగ‌మించ‌లేక‌పోవ‌టాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌.

ఇలాంటివేళ ఆమె ఒక ట్వీట్ చేశారు. ఆస‌క్తిక‌రంగా మారిన ఈ ట్వీట్ లో ఏముందంటే.. నేను ఫైట్ చేస్తా.. జీవిస్తా.. చిన్న‌.. పెద్ద స‌మ‌స్య‌లు వ‌చ్చినా ఫ‌ర్లేదు వాటిని ఎదుర్కొంటా. జ‌యిస్తా.. ఉన్న‌త స్థానానికి ఎదుగుతా.. నా బ‌లాన్ని నేను న‌మ్ముతున్నా. స‌మ‌స్య‌ల్ని త‌రిమేస్తా. స్వేచ్ఛ‌.. సంతోషం చాలా ముఖ్యం. ధైర్యం ఉంటూ ఫెయిల్ కావ‌టం ఉందంటూ చెప్పిన ఆమె.. తాను న‌టించిన ఆడై సినిమా క‌థ‌గా పేర్కొన‌టం గ‌మ‌నార్హం. అమ‌లాపాల్ తాజా ట్వీట్ చూస్తుంటే సినిమా క‌థ చెప్పిన‌ట్లు లేదు.. తాజాగా తానున్న ప‌రిస్థితి గురించి చెప్పిన‌ట్లుగా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. సినిమా క‌థ‌గా చెప్పే బ‌దులు అస‌లు విష‌యాన్ని ఓపెన్ గా చెప్పేయొచ్చుగా అమ‌లాపాల్?