Begin typing your search above and press return to search.
నగ్నత్వం తప్పు కాదు.. ఎవరినీ పట్టించుకోను!
By: Tupaki Desk | 14 July 2019 5:26 PM GMTఅమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన ఆమె (ఆడై) ఈనెల 19న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ ముంగిట చిత్రయూనిట్ ప్రచారంలో వేడి పెంచింది. ఇటీవలే రిలీజైన టీజర్ లో అమలాపాల్ నగ్నంగా కనిపించి యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. ఆడై పోస్టర్లు ఇప్పటికే ఆసక్తిని పెంచాయి. ఇక టీజర్ లో అమలాపాల్ బోల్డ్ పెర్ఫామెన్స్ .. నగ్నత్వం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. జూదం.. పొగ తాగడం.. ఆల్కహాల్ సేవించడం.. దేనికైనా రెడీ అనే మనస్తత్వం ఉన్న బోల్డ్ గాళ్ పాత్రలో అమలాపాల్ నటిస్తుండడం వేడెక్కిస్తోంది.
అయితే ఇలా చేయడం తప్పు కాదా? నగ్నంగా కనిపించడం అన్నది మన కల్చర్ కాదు కదా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దానికి అమలాపాల్ అంతే షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఈ సినిమా ఎక్స్ పోజింగ్ గురించో లేక సెక్స్ గురించో కాదు. అవన్నీ కథలో భాగంగా మాత్రమే కనిపిస్తాయి. ఒక ఒరిజినల్ కథను యథాతథంగా చూపించాలని అనుకున్నారు దర్శకుడు రత్నకుమార్. ఈ తరహా కథాంశాలు కేవలం హాలీవుడ్ లో మాత్రమే చూడగలం. మనకు కూడా ఇలాంటివి రావాలి.. అని అమలాపాల్ అన్నారు.
మన సంఘంలో ఇలాంటివి అంగీకరించరు కదా? అని ప్రశ్నిస్తే .. అవన్నీ ఆలోచిస్తే నేను నటిని అయ్యేదానిని కాదని అమలాపాల్ అన్నారు. పెయింటర్ నగ్నంగా ఉన్న మహిళను పెయింటింగ్ చేస్తారు. ఆస్పత్రికి వెళితే గైనకాలజిస్ట్ చికిత్స చేస్తారు. ప్రతిదానికీ కండిషన్లు పెడితే కుదరదు. ఈ సంఘం నన్ను జడ్జ్ చేస్తుంది అని ఆలోచిస్తూ కూచోలేను. ఎంపిక చేసుకున్న పాత్రకు న్యాయం చేయడమే నా పని.. అయినా టీజర్ చూసి సినిమా మొత్తాన్ని నిర్ణయించకూడదు. మొత్తం సినిమా చూశాక అందరూ కన్విన్స్ అవుతారు. నగ్నత్వం వెనక కారణం చూస్తారు. అయినా ఏదో ఒక సాంగ్ కోసమే బట్టలు విప్పేస్తున్నారు నటీమణులు. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే కంటెంట్ ఉన్న సినిమా కోసం నేను ఇలా చేయడం తప్పేమీకాదు.. అని అమలాపాల్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. నగ్నంగా ఉండే సన్నివేశాలు తెరకెక్కించేప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే సెట్ లో ఉన్నారని అమలాపాల్ తెలిపారు.