Begin typing your search above and press return to search.

చెప్పే వరకూ ఆగండి.. చెప్పే చేసుకుంటా: అమల పాల్

By:  Tupaki Desk   |   24 April 2020 12:30 PM GMT
చెప్పే వరకూ ఆగండి.. చెప్పే చేసుకుంటా: అమల పాల్
X
కొంతమంది హీరోయిన్లు మరీ డీసెంట్. జీవితం చప్పగా సాగుతుంది. నటన తప్ప వారికి మరో లోకం ఉండదు. ఎఫైర్లు ఉండవు.. బాయ్ ఫ్రెండ్లు ఉండరు.. లవ్ లు బ్రేకప్పులు అసలే ఉండవు. వివాదాలు కూడా ఆమడ దూరంలో ఉంటాయి. కానీ అమల పాల్ అలా కాదు. పైన చెప్పుకున్నవి.. అంతకు మించి అన్నట్టుగా ఉంటాయి. వివాదాలు అయితే లెక్కలేనన్ని. ఈమధ్య అమలకు.. భవనిందర్ సింగ్ కు సీక్రెట్ మ్యారేజ్ జరిగిందని కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే అవి నిజం కాదని.. యాడ్ షూట్ మాత్రమేనని తుస్సుమనిపించింది అమల.

ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో ఈ రహస్య వివాహం ప్రస్తావన తీసుకొస్తే తన పెళ్లి పుకార్లను ఆపాలని అందరికీ విజ్ఞప్తి చేసింది. "అలాంటివి ఏవైనా ఉంటే నేనే ఓపెన్ గా చెప్తాను.. నా ప్రేమ గురించి కూడా ఓపెన్ గా చెప్పాను కదా?" అంటూ లాజిక్ చెప్పింది. వివాహం గురించి కూడా చెప్తానని అయితే ప్రస్తుతం తన కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత తన మ్యారేజ్ గురించి మాట్లాడతానని వెల్లడించింది. ఆ సమయం వచ్చేవరకూ దయచేసి ఈ ప్రచారం ఆపాలని కోరింది. ఇదంతా ఒక ఎత్తైతే అమల ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పి సింగిల్ గా ఉందని కోలీవుడ్ లో కొత్త పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇక కెరీర్ పరంగా అమల చాలా బిజీగా ఉంది. తమిళం లో 'అదో అంద పార్వై పోల'.. 'కేడవర్' అనే సినిమాల్లో.. మలయాళంలో 'ఆడు జీవితం' అనే సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా తెలుగులో 'లస్ట్ స్టోరీస్' వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది.