Begin typing your search above and press return to search.
అమలా పాల్.. కొత్త కాంట్రవర్శీ
By: Tupaki Desk | 1 April 2017 6:01 AM GMTఅమలా పాల్.. ఈ పేరుతో ఎప్పుడూ వివాదాలు ముడిపడి ఉంటాయి. కెరీర్ ఆరంభంలో తన భర్త తండ్రితో ఎఫైర్ పెట్టుకునే కోడలి పాత్ర చేసి తమిళనాట మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది ఈ అమ్మాయి. ఆ తర్వాత కూడా కొన్ని వివాదాలు ఆమెను వెంటాడాయి. ఇక ఏడాది కిందట తన భర్త విజయ్ నుంచి విడిపోవడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మధ్య ఆమె చేస్తున్న ఫొటో షూట్లు.. షేర్ చేస్తున్న ఫొటోలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా అమల ఒక హాట్ హాట్ యోగా ఫొటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆమె యోగా పోజులు ఇచ్చిన గది గోడ మీద బుద్ధుడి బొమ్మ కనిపిస్తోంది. ఒక ఫొటోలో అమల శీర్షాషనం వేయగా.. ఆమె కాళ్లు బుద్ధుడి ముఖానికి తాకుతున్నట్లుగా ఉన్నాయి. దీంతో బుద్ధుడిని అనుసరించే భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయి. వారు ఆమె మీద సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. వెంటనే ఆ పోస్ట్ డెలీట్ చేయాలని.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అమలా ఈ ఫొటోలు డెలీట్ చేయలేదు. దీని గురించి అసలు స్పందించనే లేదు. అమల ఉద్దేశపూర్వకంగా అలా చేసి ఉండకపోవచ్చు కానీ.. ఫొటో చూస్తే వేరే అభిప్రాయాలు కలగడం సహజం. ఇంతకుముందు సానియా మీర్జా కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఆమె జాతీయ జెండా వైపు కాలు చూపిస్తున్నట్లుగా ఉన్న ఒక ఫొటో అప్పట్లో వివాదాస్పదమైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/