Begin typing your search above and press return to search.

ఆమెను పశువులా అనుభ‌విస్తున్నారు!- అమ‌లాపాల్

By:  Tupaki Desk   |   29 April 2020 3:45 AM GMT
ఆమెను పశువులా అనుభ‌విస్తున్నారు!- అమ‌లాపాల్
X
ఫైర్ యాడెడ్ టు ద పెట్రోల్!! .. ఆ మాత్రం ఫైర్ లేనిదే జీవితంలో మ‌జా ఏం ఉంటుంది? ఆన్ స్క్రీన్.. ఆఫ్ ద స్క్రీన్ ఈ త‌ర‌హాలో డేర్ చూపించే క‌థానాయిక‌లు చాలా అరుదు. అయితే ఫైర్ క్రాకర్స్ జాబితాలో అమ‌లాపాల్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంటుంది. వెండితెర‌పై వేడెక్కించే పాత్ర‌ల‌తో ర‌క్తి క‌ట్టించే ఈ అమ్మ‌డు రియాలిటీలోనూ వేడెక్కించే కామెంట్ల‌తో విరుచుకుప‌డుతుంటుంది. ఒక కోణంలో చూస్తే అమ‌లాపాల్ లోని స్త్రీ వాది గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌న‌లోని రెబ‌లియ‌న్ యాటిట్యూడ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నే లేదు.

ఇటీవ‌ల‌ న‌టించిన ఆమె (ఆడై) చిత్రంలో న‌గ్నంగా న‌టించి సంచ‌ల‌నం సృష్టించింది. అంత‌కుముందు మృగం చిత్రంలో మామ‌తో శృంగారం చేసే కోడ‌లి పాత్ర‌లో ర‌క్తి క‌ట్టించింది. అమలా పాల్ కెరీర్ లో ఇలాంటి సాహ‌సాలెన్నో. అయితే అనూహ్యంగా నాన్న ఫేం ద‌ర్శ‌కుడు ఏ.ఎల్.విజ‌య్ ని పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగు పెట్టాక పాల్ ఆ నిర్భంధ జీవితాన్ని కొన‌సాగించ‌లేక‌పోయింది. న‌ట‌వృత్తిని కొన‌సాగించేందుకు కుద‌ర‌ద‌నే భ‌ర్త‌- అత్త మామ‌లు ఆంక్ష‌లు విధించ‌డంతో అందుకు స‌సేమిరా అంటూ వ్య‌తిరేకించిన అమ‌లా పాల్.. అనంత‌రం విజ‌య్ నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ద‌ర్శ‌కుడు సుశీ గ‌ణేష‌న్ పై ఆరోపిస్తూ మీటూ ఉద్య‌మానికి బాస‌ట‌గా నిలిచింది పాల్. ఇలాంటి వివాదాలు గొడ‌వ‌లు త‌న లైఫ్ లో ఎన్నో ఉన్నాయి.

తాజాగా మ‌రోసారి అంత‌కుమించిన వివాదాన్ని రాజేసింది పాల్. 1923 సంవత్సరంలో ఖలీల్ గిబ్రాన్ రాసిన `ప్రవక్త` (ది ప్రొఫెట్) గ్రంధాన్ని అభ్య‌సించిన అమ‌లాపాల్ సోష‌ల్ మీడియా పోస్టులో స్త్రీవాదాన్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేసింది. స్త్రీని అదుపులో పెట్టుకునే పురుషుడి అహంపై అమ‌లాపాల్ చాలా సంగ‌తులే చెప్పుకొచ్చిందిలా. ది ప్రొఫెట్ లో స్త్రీల‌కు సంబంధించిన ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు ఉన్నాయి. స్త్రీలు-ప్రేమ గురించి.. వివాహం గురించి.. పిల్లల గురించిన ప్ర‌శ్న‌లున్నాయి. గ‌ర్భ‌ధార‌ణ ప్ర‌స‌వంలోని భ‌రించ‌లేని నొప్పి.. స్త్రీ బానిసత్వం.. అవమానం.. ఆర్థిక అవ‌స‌రాల‌కు స్త్రీ పురుషుడిపై ఆధారపడటం లాంటి అనేకానేక విష‌యాల‌పై ప్ర‌శ్న‌ల్ని సంధించింది ప్ర‌వ‌క్త పుస్త‌కం.

గర్భధారణ సమయంలో ఒక మహిళ ఎదుర్కొనే పోరాటాన్ని ఈ పోస్టులో వివ‌రించింది. ``పిల్లవాడు తొమ్మిది నెలలకు పెరిగేప్పుడు.. క‌డుపులో ఏదో పైకి విసిరేసిన‌ట్టుగా.. వాంతి అవుతున్న‌ట్టుగా అనిపిస్తుంది. పిల్లల పుట్టుక దాదాపు స్త్రీ మరణంతో స‌మానం. ఒక‌సారి గ‌ర్భం ధ‌రించి పిల్లాడిని క‌న్న త‌ర్వాత కూడా మ‌రోసారి గ‌ర్భ‌వ‌తిని చేయ‌డం పురుషుడి ప‌ని`` అని అమ‌లా ఆ పోస్టులో పేర్కొంది. ``ఆడ‌దాని ఏకైక పని జనసమూహాన్ని ఉత్పత్తి చేయడమే అనిపిస్తుంది. తాను అనుభవించే బాధలో పురుషుడు భాగ‌స్వామి కానే కాదు`` అంటూ తీవ్రంగానే నిందించింది. మ‌గాడు తన కామదాహాన్ని.. లైంగిక కోర్కెల్ని తీర్చుకునేందుకు స్త్రీని ఒక వస్తువుగా ఉపయోగిస్తున్నాడు. స్త్రీకి పర్యవసానాలు ఎలా ఉంటాయనే దాని గురించి మ‌గాళ్లు ఏమాత్రం ఆందోళన చెందరు`` అంటూ ఆ పోస్టులో దుయ్య‌బ‌ట్టింది. ఒక పురుషుడు స్త్రీని నిజంగా ప్రేమిస్తే అస‌లు ప్రపంచంలో ఇంత‌ అధిక జనాభా ఉండేది కాదని ఆమె పోస్ట్ చెప్పింది. ``అతని మాటల్లో `ప్రేమ` పూర్తిగా అబ‌ద్ధం. మ‌గాడు స్త్రీని దాదాపు పశువులా అనుభ‌విస్తున్నాడు`` ఆమె తన పోస్ట్ ద్వారా చెప్పారు.

ప్రస్తుతం అమలా పాల్ తన స్వస్థలమైన కేరళలో తన తల్లితో కలిసి స్వీయ‌ నిర్బంధ సమయాన్ని గడుపుతోంది. `అధో అంతా పరవై పోలా`.. `ఆదుజీవితం` చిత్రాల‌తో బిజీ. అలాగే బంప‌ర్ హిట్ వెబ్ సిరీస్ `లస్ట్ స్టోరీస్` రీమేక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.