Begin typing your search above and press return to search.

రెండోసారి కూడా ప్రేమ పెళ్లే

By:  Tupaki Desk   |   15 Jun 2017 4:36 AM GMT
రెండోసారి కూడా ప్రేమ పెళ్లే
X
ప్రేమించుకోవడాలు.. పెళ్లి చేసుకోవడాలు కామన్. అన్ని ప్రేమలు పెళ్లి వరకూ రావు.. పెళ్లి చేసుకున్నా అన్నీ కలకాలం నిలవవు. ఈ విషయం చాలాసార్లే ప్రూవ్ అవుతూ ఉంటుంది. కెరీర్ లో కీలకమైన స్థాయిలో ఉండగానే ప్రేమ పెళ్లి చేసుకుంది హీరోయిన్ అమలాపాల్.

అయితే.. ఈ పెళ్లికి నిండా రెండేళ్లు గడవకుండానే బ్రేకప్ చెప్పేయాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయాలనే అమలాపాల్ పట్టుదలే.. ఇందుకు కారణం అన్నట్లుగా భర్త తరఫు కుటుంబసభ్యుల నుంచి కామెంట్స్ వచ్చాయి. వీటిపై అరుదుగా రియాక్ట్ అయిన అమల.. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోతూ.. విడాకుల విషయాన్ని మెల్లగా పక్కకు పెట్టేసింది. అయితే.. ఓ వారం క్రితం తనను తాను సుచీ లీక్స్ లో చూసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఈమె విడాకులకు కూడా.. ఓ తమిళ్ హీరోతో సాన్నిహిత్యమే అసలు కారణం అనే వాదన ఒకటి ఉంది.

మళ్లీ పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్న ఈమెకు ఎదురైంది. దీనికి 'నేనేమైనా సన్యాసం తీసుకుంటానని చెప్పానా.. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా.. తప్పనిసరిగా ప్రేమ పెళ్లినే చేసుకుంటా' అని ఖరాఖండీగా తేల్చేసింది. మొదటి పెళ్లి కూడా లవ్ తర్వాత చేసుకుని.. అది ఫెయిల్ అయినా.. రెండో పెళ్లి కూడా ప్రేమించే చేసుకుంటానని చెబుతోందంటే.. అమలకు ప్రేమపై ఎంత నమ్మకమో కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/