Begin typing your search above and press return to search.
ఆమెకు టాలీవుడ్ పై ఆసక్తి లేదా!!
By: Tupaki Desk | 18 Nov 2021 5:23 AM GMTఇండస్ట్రీలో కొనసాగాలంటే వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. చిన్న సినిమాల విషయంల ఆలోచించినా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తే ఆలోచన లేకుండా కమిట్ అయితేనే భవిష్యత్తు ఉంటుందనే విషయం హీరోయిన్ అమలా పాల్ కు తెలియదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు విమర్శలు చేస్తున్నారు. హీరోయిన్ గా ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవు. తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేస్తున్నా అవి బజ్ ను క్రియేట్ చేయడం లో విఫలం అయ్యాయి. ఒకటి రెండు వెబ్ సిరీస్ ల్లో నటించింది మరియు బాలీవుడ్ లో కూడా ఈమె సినిమాను చేస్తుంది. ఈ సమయంలో ఈమెకు టాలీవుడ్ నుండి నాగార్జున హీరోగా నటిస్తున్న ఘోస్ట్ ఆఫర్ వచ్చిందట.
టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఘోస్ట్ సినిమాకు ఆమె నో చెప్పిందని వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఘోస్ట్ సినిమాకు గాను ఏకంగా కోటి రూపాయల పారితోషికంను డిమాండ్ చేసిందట. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ కోటి నుండి కోటిన్నర పారితోషికం అందుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అమలా పాల్ తెలుగు లో నటించేందు కోటి డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని మేకర్స్ భావించారు. ఆమె ప్రస్తుత టాలీవుడ్ మార్కెట్ కేవలం 50 లక్షలు మాత్రమే. ఆ మొత్తంను ఇచ్చేందుకు ఘోస్ట్ మేకర్స్ ఓకే చెప్పారని సమాచారం. కాని ఆమె మాత్రం కోటి కావాల్సిందే అంటూ డిమాండ్ చేయడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.
అమలా పాల్ కోటి డిమాండ్ ను చేయడం చూస్తుంటే ఆమెకు టాలీవుడ్ లో నటించే ఆసక్తి లేనట్లుగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో సినిమాలు చేయాలని భావిస్తే ఆమె పారితోషికం విషయంలో రాజీ పడేది. నాగార్జున వంటి స్టార్ హీరో సినిమాలో నటించేందుకు గాను ఆమెకు వచ్చిన ఆఫర్ ఈమద్య కాలంలో ఆమెకు దక్కిన పెద్ద అవకాశం. కాని ఆ అవకాశంను కూడా ఆమె వదులుకుంది అంటే ఆమె ఆలోచన ఏంటో అర్థం అవ్వడం లేదంటున్నారు. హీరోయిన్ గా ఆమె నటించిన సినిమాలు తెలుగు లో పెద్దగా ఆడిందే లేదు.. పైగా ఆమె పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే.. అలాంటి హీరోయిన్స్ ను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు అనేది కూడా తెల్సిందే. అయినా కూడా ఆమె కోటి డిమాండ్ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటో ఆమె చెప్పాలి.