Begin typing your search above and press return to search.

సెక్స్ రాకెట్ గురించి ఆరా తీయాల్సిందే

By:  Tupaki Desk   |   15 Feb 2018 6:57 AM GMT
సెక్స్ రాకెట్ గురించి ఆరా తీయాల్సిందే
X
కోలీవుడ్ భామ అమలాపాల్.. తనను అళగేశన్ అనే వ్యక్తి సెక్స్ రాకెట్ లో ఇరికించేందుకు ప్రయత్నించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి.. అతడితో పాటు మరో ఇద్దరి అరెస్టులకు కూడా కారణం అయింది. ఇంకా మరికొంతమంది అరెస్టులు అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పింది. ఆ సంఘటన ఎలా జరిగిందో సుదీర్ఘంగా వివరించింది కూడా.

తను మలేషియా ఈవెంట్ కోసం ప్రిపేర్ అవుతుండగా.. ఓ వ్యక్తి వచ్చి.. మలేషియా ప్రోగ్రామ్ తర్వాత పలువురు ఇతర ఇండస్ట్రీ పర్సన్స్ తో జరిగే ఓ డిన్నర్ కు అటెండ్ కావాలని ఆఫర్ ఇచ్చాడట. ఏంటి ఆ డిన్నర్ స్పెషల్ అని అడిగితే.. ఫూల్ లా మాట్లాడకు.. నువ్వేమీ చిన్నపిల్లవు కావు అన్నాడట. అతని ఉద్దేశ్యం అర్ధమైన అమలాపాల్.. తన టీంను పిలిచి అతడిని ఆ స్టూడియోలోనే బంధించి.. మొత్తానికి పోలీసులకు అప్పగించింది. అయితే.. ఓ 30 నిమిషాల పాటు.. అళగేశన్ అనే వ్యక్తి జస్ట్ ఓ బిజినెస్ డీల్ మాట్లాడుకున్న వాడిలాగా తిరగడం ఆమెను ఆశ్చర్యపరిచిందని చెబుతోంది అమలాపాల్. తన లేటెస్ట్ ఫోన్ నెంబర్ కూడా అతని ఫోన్ లో ఉండడం చూస్తే.. వీళ్లు ఎంత ఆర్గనైజ్డ్ గా ఈ రాకెట్ నడుపుతున్నారో అని ఆశ్చర్యపోయింది అమలాపాల్.

కానీ అమలాపాల్ లెటర్ పరికిస్తే.. ఆర్గనైజ్డ్ సెక్స్ రాకెట్ గురించి అనే సంగతి అర్ధమవుతుంది. అంత ధైర్యంగా వచ్చి ప్రపోజల్ పెట్టాడంటే.. ఆ డిన్నర్ కు అటెండ్ అయ్యే ఇతర హీరోయిన్లు ఎవరు అనే సంగతి ఆలోచించాల్సిందే. ఇప్పుడా విషయాలపైనే కోలీవుడ్ లో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని అరెస్టులు.. మరికొన్ని అరెస్టులు కూడా చేయనుండడం వంటివి చూస్తుంటే.. ఈ సెక్స్ రాకెట్ భాగోతంలో చాలానే పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి దీని గురించి సినీ పెద్దలు ఆరా తీసి.. వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందిలే.