Begin typing your search above and press return to search.

దీపావళి కొవ్వుని హీరోయిన్ కరిగిస్తోంది

By:  Tupaki Desk   |   20 Oct 2017 11:48 AM GMT
దీపావళి కొవ్వుని హీరోయిన్ కరిగిస్తోంది
X
అమ్మో రెండు స్వీట్లు పెరిగిపోతే చాలా క్యాలరీస్ ఎక్కువైపోయి కొవ్వు పెరిగిపోతుంది.. అని సామాన్య మానవుడు ఎవ్వరూ ఆలోచించకపోవచ్చు కాని.. సినిమా వాళ్లు మాత్రం కాస్త ఆలోచిస్తారు. ముఖ్యంగా హీరోలూ హీరోయిన్లూ ఆ లెక్కలు చూసుకోకుండా ఆహారం తీసుకోరు. లేకపోతే వారు షేప్ అవుట్ అయిపోతారుగా.

ఆ మధ్యన డైటింగ్ గురించి చాలానే చెప్పిన డస్కీ బ్యూటి అమలా పాల్.. ఇప్పుడు పెరుగుతున్న కొవ్వును తగ్గించడానికి పరిగెత్తుతానని చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం పంజాబ్ లో సరదాగా ఏదో టూర్ ఎంజాయ్ చేస్తున్న ఈ సుందరి.. నిన్న దీపావళి సందర్భంగా ఓ రెండు జిలేబీలు లాగించిందట. దానితో బాడీలో ఎక్కడ అనవసరమైన చోట ఆ కేలరీలు కొవ్వుగా పేరుకుపోతాయోనని.. అమ్మడు వెంటనే షార్ట్స్ వేసుకుని ట్రాక్ లోకి దూకేసింది. అదేనండీ.. రన్నింగ్ చేసేస్తోంది. ఆ విధంగా తనను తాను ఫిట్ గా ఉంచుకుంటాను అని చెబుతోంది.

ఆ మధ్యన సుచీ లీక్స్ యవ్వారం జరిగినప్పుడు.. నా వీడియో కోసం నేను వెయిట్ చేస్తున్నా అంటూ ఓపెన్ గా సెటైర్ వేసిన అమలాపాల్.. మొన్న ధనుష్‌ 'విఐపి 2' సినిమాలో మెరిసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో మలయాళం సినిమాలు తప్పిస్తే.. తెలుగు అండ్ తమిళంలో స్టార్ హీరోల సినిమాలు మాత్రం లేవు. ఒంట్లోని కొవ్వును కంట్రోల్ చేసుకున్నాక మరి అవకాశాల కోసం ఏమన్నా చేస్తుందేమో చూడాలి.