Begin typing your search above and press return to search.

తుస్సుమనిపించిన అమల పాల్!!

By:  Tupaki Desk   |   22 March 2020 8:00 AM GMT
తుస్సుమనిపించిన అమల పాల్!!
X
సౌత్ అంతా గుర్తింపు ఉన్న అతి తక్కువమంది హీరోయిన్లలో అమల పాల్ ఒకరు. ఓ క్రేజీ భామకు ఉండాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉండడంతో ఆటోమేటిక్ గా పాపులారిటీ వచ్చేసింది. వివాదాలు అనేవి అమలకు కొత్తేమీ కాదు. ఏదో ఒక విషయంలో మీడియాలో హైలైట్ కావడం కూడా అమలకు సర్వసాధారణం. రీసెంట్ గా మరోసారి అలాంటిదే జరిగింది.

గాయకుడు భవిందర్ సింగ్ తన ఇన్స్టా ఖాతా ద్వారా నిన్న కొన్ని ఫోటోలు షేర్ చేసి.. కొద్ది సేపట్లోనే డిలీట్ చేశాడు. అయితే ఆ ఫోటోలు నిముషాల వ్యవధిలోనే వైరల్ అయ్యాయి. భవిందర్ సింగ్-అమల పాల్ ఇద్దరి పెళ్లి ఫోటోలలాగా ఉండడంతో వారి వివాహం జరిగిందని మీడియాలో న్యూస్ వచ్చేసింది. ఇద్దరూ పంజాబీ సంప్రదాయ దుస్తులు ధరించడంతో పాటుగా.. మోడరన్ స్టైల్ లో మ్యారేజ్ కిస్సు కూడా ఇచ్చుకున్నారు. అమల సీక్రెట్ మ్యారేజ్ ఫోటోలు అంటూ ఎంతో హంగామా జారింది. అయితే ఈ విషయంపై అమల అధికారికంగా స్పందించలేదు.

ఈ విషయం నిర్ధారణ చేసుకునేందుకు అమలను సంప్రదిస్తే తన మేనేజర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. అది తనకు భాగస్వామ్యం ఉన్న కంపెనీ ప్రమోషన్ కోసం చేసిన ఓ క్యాజువల్ ఫోటోషూట్ మాత్రమే అని చెప్పింది. అసలు నేను సీక్రెట్ గా ఎందుకు పెళ్లి చేసుకుంటాను.. కనీసం డిజైనర్ దుస్తులు కూడా ధరించకుండా ఎలా?? అంటూ మీడియాకే తిరిగి ప్రశ్నలు సంధించింది. అయితే ఆ ఫోటోలు చూసినవారికి మాత్రం అవి ఉత్తుత్తి వ్యవహారం అని నమ్మకం కలగడం లేదు. ఎంతైనా క్రేజీ భామ కదా.. ఆమాత్రం హాట్ టాపిక్ కాకుండా ఎలా ఉంటుంది?