Begin typing your search above and press return to search.

తీయటి బాధను గుర్తుతెస్తోందంతే

By:  Tupaki Desk   |   14 Jan 2017 5:37 AM GMT
తీయటి బాధను గుర్తుతెస్తోందంతే
X
అన్నింటికీ ఆమె డైవర్స్ తో ముడిపెట్టలేం కాని.. డస్కీ బ్యూటి అమలా పాల్ మాత్రం దర్శకుడు ఏ.ఎల్.విజయ్ దగ్గరనుండి డైవర్స్ తీసుకున్న తరువాత మాత్రం గ్లామర్ పరంగా రెచ్చిపోతోంది అంతే. హాట్ హాట్ ఫోటో షూట్ల నుండి.. సినిమాల్లోనూ పిచ్చ హాటుగా కనిపించడం వరకు.. ఆమె అన్నింటా ముందే ఉంటోంది. ఇప్పుడు హాట్ సెల్ఫీలతో కూడా రెచ్చగొడుతోంది.

అదిగో తన స్నేహితురాలు ఒకరితో దిగిన సెల్ఫీ ఒకటి షేర్ చేసింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ముక్కుకు నత్తు పెట్టుకుని ఎంతో సెక్సీగా కనిపిస్తున్న ఆ ఛార్మింగ్ కిలాడీ.. అక్కడ కురచైన షార్టు వేసుకుని తన మేని సొగసులతో కూడా టీజింగ్ చేసేస్తోంది. అంతే కాదు.. ఆ టాపు లోనుండి తొంగి చూస్తున్న ఆ ఇన్నర్ వేర్ తాలూకు ప్రభావం కూడా గాట్టిగానే ఉంది. అమలను ఇలా వీక్షించిన వారందరూ.. ఎందుకు బాబూ ఇలా చంపేస్తోంది అంటూ మనస్సులో తాకిన ఓ తీయటి బాధను గుర్తు చేసుకుంటున్నారు.

తెలుగులో చరణ్‌.. బన్నీ.. నాగచైతన్య వంటి స్టార్లతో పనిచేసిన అమలా పాల్.. ఎందుకోగాని ఇక్కడి ఫిలిం మేకర్లను ఇంప్రెస్ చేయలేకపోయింది. కొందరు ఇంప్రెస్ అయినా కూడా.. అమ్మడి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి వారు సింపుల్ గా సైడ్ అయిపోయారు. తమిళం అండ్ మలయాళంలో మాత్రం అమ్మడికి నాలుగైదు సినిమాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/