Begin typing your search above and press return to search.
ఫోటో టాక్: ఆమె జీవితం తలకిందులు
By: Tupaki Desk | 17 Dec 2020 5:49 AM GMT`ఆమె` (ఆడై) సినిమాలో అమలాపాల్ పెర్ఫామెన్స్ కి ఫిదా కాని అభిమాని లేరు. బోల్డ్ క్యారెక్టర్లలో నటించడం తనకు కొత్తేమీ కాదు.. కానీ ఈ మూవీలో పూర్తి నగ్నంగా కనిపించి అమలా ఇచ్చిన సర్ ప్రైజ్ ట్రీట్ ని ఎవరూ మర్చిపోలేదు. రోడ్లపై ప్రాంక్ చేస్తూ జీవితాలతో ఆడుకునే లేడీ రిపోర్టర్ గా పాల్ నటనకు అభిమానులు మంత్రముగ్ధులే అయ్యారు. ఇక నిజజీవితంలోనూ అమలాపాల్ రెబలియన్ యాటిట్యూడ్ గురించి నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో దూకుడున్న నాయికగా అమలాపాల్ పేరు రిజిస్టర్ అయ్యింది. అప్పట్లో కాకినాడ యానాంలో తన బెంజి కార్ ని రిజిస్ట్రేషన్ చేయించడం అనంతరం అధికారులు తాఖీదును ఇవ్వడం తెలిసిందే. ఇటీవల అమలాపాల్ తన మాజీ ప్రియుడు భవ్నీందర్ సింగ్ ని పెళ్లాడేస్తున్నారన్న పుకార్లు వెల్లువెత్తడంతో ఆమె కోర్టులను ఆశ్రయించగా పాజిటివ్ తీర్పుతో ఉపశమనం లభించింది.
కారణం ఏదైనా కానీ...అమలాపాల్ లో ఇటీవల ఎంతో మార్పు కనిపిస్తోంది. తనదైన ఆధ్యాత్మిక జీవనంతో అభిమానుల మనసు దోస్తోంది. తాను తన జీవితాన్ని ఎదుర్కోవటానికి ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నానని ఇటీవలే ప్రకటించారు. జీవితాన్ని ఇప్పుడు పూర్తిగా వేరే కోణం నుండి చూస్తున్నానని వెల్లడించింది పాల్. ఇటీవల ఆమె ఫోటోలు.. వీడియోలు ప్రకృతి ఆరాధనతో నేచురల్ వే లివింగ్ ని ఆవిష్కరిస్తున్నాయి. గ్లామర్ ఎలివేషన్ ఆడంబరాలను మించి సింప్లిసిటీ కనిపిస్తోంది.
అమలా పాల్ ఇటీవల యోగా నైపుణ్యంపై రకరకాల విషయాల్ని ఇన్ స్టా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా మరో హాట్ యోగా పోజుతో అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారారు పాల్. ఇదిగో ఇలా తలక్రిందులుగా వేలాడుతున్న చిత్రాన్ని పోస్ట్ చేయగా అది వైరల్ గా దూసుకెళుతోంది. `ఇదే కొత్త ఆరంభం` అన్న వ్యాఖ్యను జోడించింది అమలా. హైదరాబాద్ ఆధారిత కేరళ ఆయుర్వేద ఆస్పత్రికి అమలా ప్రచారం సాగిస్తున్నారు.
మరోవైపు కెరీర్ పరంగానూ బిజీ. ఇప్పటికిప్పుడు అమలా పాల్ చేతిలో 4 ప్రాజెక్టులున్నాయి. ఇందులో రెండు తమిళ చిత్రాలు కాగా.. అధో అంధ పరవై పోలా- కాడవర్.. మలయాళంలోనూ ఓ సినిమా చేస్తోంది. `లస్ట్ స్టోరీస్` తెలుగు రీమేక్ లో అమలా పాల్ కనిపించనున్నారు.