Begin typing your search above and press return to search.
బీబర్ మీద అమల సెటైర్ చూశారా..
By: Tupaki Desk | 13 May 2017 5:40 AM GMTజస్టిన్ బీబర్.. జస్టిన్ బీబర్ అంటూ కొన్ని రోజుల నుంచి ఊగిపోతున్నారు భారతీయ కుర్రకారు. తీరా అతను ఇండియాకొచ్చి ముంబయిలో చేసిన షో చూశాక అందరిలోనూ అసంతృప్తే కనిపిస్తోంది. మామూలు మ్యూజిక్ లవర్స్ మొదలుకుని.. సెలబ్రెటీల వరకు అందరూ అతడి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. బీబర్ కన్సర్ట్ సందర్భంగా తమకు రాయల్ ట్రీట్మెంట్ ఉంటుందని భావించిన సెలబ్రెటీలకు అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడం.. సామాన్య ప్రేక్షకుల్లో తామూ ఒకరిగా మారిపోవడం.. కొందరికి ఆ ఈవెంట్లో పాల్గొనే అవకాశం దక్కపోవడం కూడా వారి అసహనానికి కారణంగా చెబుతున్నారు.
మరి అమలా పాల్ కు అలాంటి ఇబ్బందేమైనా ఎదురైందో ఏమో తెలియదు కానీ.. బీబర్ ను ఉద్దేశించి ట్విట్టర్లో ఆమె వేసిన సెటైర్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. తన చేతిలో పక్షుల్ని పెట్టుకుని ఫొటో దిగిన అమలా పాల్.. బీబర్ కంటే ఇవే బాగా పాడతాయని.. అవి అనవసర అతి కూడా చేయవని వ్యాఖ్యానించడం ద్వారా బీబర్ మీద సెటైర్ వేసింది. చాలామంది ఆమె వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ట్వీట్లు పెట్టగా.. కొందరు రివర్సులో అమలాకే సెటైర్లు వేశారు. ‘‘నీ కంటే నా కుక్క బాగా నటిస్తుంది’’ అంటూ ఓ వ్యక్తి అమలాకు కౌంటర్ ఇచ్చాడు. బీబర్ షోలో పాల్గొనేందుకు అమలా ముంబయి వెళ్లిందని.. కానీ అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వెనక్కి వచ్చిందని.. ఆ ఫ్రస్టేషన్లోనే ఆమె ఇలా కామెంట్లు చేసిందని కొందరంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/