Begin typing your search above and press return to search.
నిర్మాతగా మారుతున్న చెర్రీ హీరోయిన్
By: Tupaki Desk | 5 April 2019 7:28 AM GMTరామ్ చరణ్ నాయక్ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు నటించిన మరో హీరోయిన్ అమలా పాల్ గుర్తుందిగా. ఇక్కడ ఎక్కువ సినిమాలు చేయలేదు కాని తమిళ్ లో చెప్పుకోదగ్గ సంఖ్యలో హిట్స్ ఉన్నాయి తనకు . దర్శకుడు విజయ్ తో పెళ్లి విడాకుల వ్యవహారం రచ్చ అయ్యాక కొంత కాలం సినిమాలు మానేసిన అమలా పాల్ ఇప్పుడు కొత్తగా నిర్మాతగా మారబోతోంది.
కడవేర్ అనే మూవీ తో ప్రొడ్యూసర్ గా టైటిల్ కార్డు వేసుకోబోతోంది. రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టేందుకు ముందు రావడానికి కారణం కంటెంట్ అని చెబుతోంది. శవాల మీద ప్రయోగాలు చేసే మెడికల్ స్టూడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అమలా పాల్ ఫోరెన్సిక్ డాక్టర్ భద్రగా చాలా కీలకమైన పాత్ర చేస్తోంది. కేరళను కుదిపేసిన ఓ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ఇది రూపొందిస్తున్నట్టు తెలిసింది. దర్శకుడు కూడా కొత్తవాడే. మొత్తానికి అమలా పాల్ మార్చుకున్న రూటు తనకో కొత్త కెరీర్ ఇస్తుందన్న ఆశాభావంతో ఉంది.
వైవాహిక జీవితం డిస్టర్బ్ అయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న అమలా తర్వాత ఎక్కువ రోజులు హీరొయిన్ గా కొనసాగలేకపోయింది. పెళ్ళైపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా దాని ప్రభావం అవకాశాల మీద పడింది. అందుకే ఎవరినో అడగటం ఎందుకు అని తనే నిర్మాతగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో ఇలా సినిమాల నిర్మాణం వైపు వస్తున్న కథానాయికల సంఖ్య బాగానే ఉంటోంది. కాజల్ అగర్వాల్ కూడా ఇదే తరహా ప్లానింగ్ తో మీడియం బడ్జెట్ మూవీస్ తీసేందుకు ప్రణాళిక వేసుకుంటోంది.