Begin typing your search above and press return to search.

అక్కినేనివారి ఇంట సమంత ఎప్పుడూ వంట చేయలేదా...?

By:  Tupaki Desk   |   14 April 2020 5:00 PM GMT
అక్కినేనివారి ఇంట సమంత ఎప్పుడూ వంట చేయలేదా...?
X
అక్కినేని ఫ్యామిలీలో కింగ్ నాగార్జున మరియు ఆయన తనయుడు నాగచైతన్య ఇద్దరూ ప్రేమ వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అమల, సమంత ఇద్దరూ కూడా సినీ నేపథ్యం నుండి వచ్చిన వారే. అక్కినేని వారి కోడళ్ళుగా తమ నడవడికతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక సమంత విషయానికొస్తే వివాహం తర్వాత కూడా కెరీర్‌ను నిర్లక్ష్యం చేయకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. అటు వృత్తిపరంగా, ఇటు వ్యక్తిగతంగానూ తన పని తాను చక్కగా చేసుకుంటోంది సామ్. వివాహంతో అక్కినేని వంటి పెద్ద కుటుంబంలో ఎంటర్ అయిన ఆమె తన కుటుంబంతో.. మామ నాగార్జున, భర్త నాగచైతన్యతో తన అనుబంధాన్ని ఎప్పటికప్పుడు దాచుకోకుండా సందర్భం వచ్చినప్పుడు చెబుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ మధ్య అమల ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ వెల్లడించింది.

ఈ ఇంటర్వ్యూలో 'ఇంట్లో సమంత మీకోసం వంట చేస్తుందా' అని అడిగిన ప్రశ్నకు అమల ‘నో’ అనే సమాధానం చెప్పింది. ‘సమంత ఇంట్లో వంట చేయదు. ఇంకా చెప్పాలంటే నాగార్జున వంట చేయడానికి ఇష్ట పడతారు. నాగార్జున వంట చేయడం ద్వారా స్ట్రెస్ నుండి బయటపడుతుంటారని.. నాగార్జునలో మంచి కుక్ ఉన్నాడు. నాగార్జున ఉండగా ఇక సమంతకు వంటలు చేయాల్సిన అవసరం ఏముంది’ అంటూ ఫన్నీగా సమాధానం చెప్పారట. అంతేకాకుండా ‘నేను కూడా నాగార్జున వంట చేస్తున్నప్పుడు సాయం చేస్తాను. కావాల్సినవి అందిస్తుంటాను. ఇంట్లో కుక్ ఉంటారు కాబట్టి సమంత వంట చేయాల్సిన అవసరం లేదు’ అని చెప్పింది.

అంతేకాకుండా నా భర్త అక్కినేని నాగార్జున మంచి యాక్టరే కాదు.. వంట చేయడంలో కూడా పర్ఫెక్ట్. సమంతకు మాత్రమే కాదు.. నాకు కూడా వంట సరిగా రాదంటూ అమల చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక నాగ చైతన్య కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో వంట చేశారని సమంత ఎన్నో సందర్భాల్లో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సామ్ ప్రస్తుతం 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ లో నటిస్తుండగా నాగ చైతన్య 'లవ్ స్టోరీ' సినిమాలో నటిస్తున్నాడు.