Begin typing your search above and press return to search.
శర్వా సినిమాపై ధీమాగా ఉన్న అమల..!
By: Tupaki Desk | 6 Sep 2022 2:30 PM GMTటాలెంటెడ్ హీరో శర్వానంద్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేదు. దీంతో ఇప్పుడు తన కొత్త సినిమా ''ఒకే ఒక జీవితం'' పైనే ఆశలు పెట్టుకున్నాడు.
ఇది శర్వా కెరీర్ లో మైలురాయి 30వ చిత్రం. తెలుగు తమిళ భాషల్లో రూపొందించారు. ఈ బైలింగ్విల్ మూవీతో శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. డ్రీమ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాలో రీతూ వర్మ - ప్రియదర్శి - వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
'ఒకే ఒక జీవితం' అనేది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో అమల అక్కినేని కీలక పాత్ర పోషించారు. అందుకే అఖిల్ సైతం ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగం అయ్యాడు. ఇటీవల అమల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇదొక అద్భుతమైన చిత్రమని.. కథలోని ఫాస్ట్ ప్రెజెంట్ మూమెంట్స్ అందరికీ నచ్చుతాయని అన్నారు. ఇందులో మంచి సస్పెన్స్ తో పాటు కామెడీ కూడా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రెస్ మీట్ లో అమల మాట్లాడుతూ.. "పది సంవత్సరాల తర్వాత నేను నటించిన తెలుగు సినిమా ఇది. ఇంత మంచి కథ తీసుకొచ్చి నాకు అవకాశం అందించినందుకు దర్శకుడు శ్రీకార్తీక్ కు థ్యాంక్స్ చెప్పాలి. అలానే డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రభు గారికి కృతజ్ఞతలు. వారిద్దరి కారణంగానే నేను ఈ సినిమాలో ఉన్నాను'' అని తెలిపింది.
''ఇందులో నేను శర్వానంద్ తల్లిగా నటించాను. ఈ చిత్రంతో నాకు మూడో అబ్బాయి దొరికాడు. సినిమా అంతా తల్లి ప్రేమ గురించి కాదు. సినిమాకు తల్లి ప్రేమ ఎంత అవసరమో అంతసేపు మాత్రమే ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ తల్లి ఎప్పుడూ స్పెషల్ గా ఉంటుంది. ఎల్లవేళలా సపోర్ట్ చేస్తుంది కానీ.. ఎప్పుడూ పక్కన ఉండలేదు. ఆ తర్వాత మీ లైఫ్ ని మీరే జీవించాల్సి ఉంటుంది''
''ఈ సినిమా ముగ్గురి లైఫ్ జర్నీ గురించి చెప్తుంది. వాళ్లు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ను కష్టాలను చూపిస్తుంది. వారికి ఓ అవకాశం వస్తుంది. కాలంతో ఆడుకుంటూ దాన్ని కరెక్ట్ చేయాలనుకుంటారు. కానీ విధి మాత్రం మారలేదు. మరి అలా ఎందుకు జరిగిందన్నది సినిమా చూసి తెలుసుకోవాలి''
''ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. దయచేసి అందరూ కొంచం సమయం తీసుకొని థియేటర్ కు వెళ్లి చూడండి. కచ్చితంగా మీ మనస్సును తాకుతుంది. ప్రతిభావంతులైన నటీనటులు సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను'' అని అమల చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. "ఇది పూర్తిగా తల్లీకొడుకుల అనుబంధాల నేపథ్యంలో సాగే ఎమోషనల్ చిత్రం కాదు. వినోదాత్మకంగా ఉంటుంది. సినిమా చూశాక.. ఇందులోని పాత్రలతో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒకచోట కచ్చితంగా రిలేట్ అవుతారు. ఈ నిమిషాన్ని ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ బతకగలిగితే జీవితం చాలా అందంగా ఉంటుందన్న విషయాన్ని దర్శకుడు కార్తీక్ ఈ చిత్రంతో తెలియజేశాడు. అందుకే ఈ కథకు 'ఒకే ఒక జీవితం' అన్న టైటిల్ పెట్టాం'' అని అన్నారు.
''ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. చాలా అరుదుగా దొరికే కథ ఇది. అందుకే ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా.. సంతోషంగా ఉంది. ఇప్పటికే సినిమా చూశా. చాలా సంతృప్తిగా అనిపించింది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం కలిగింది" అని శర్వా తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.