Begin typing your search above and press return to search.
ఆమని కాస్త దృష్టి పెట్టాల్సిందే!
By: Tupaki Desk | 15 Jun 2021 12:30 AM GMTనిన్నటితరం కథానాయికలలో ఆమనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నటన ప్రధానమైన పాత్రల్లో ఆమెను చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతూ వచ్చారు. 'మిస్టర్ పెళ్లామ్' .. 'శుభలగ్నం' .. ' శుభ సంకల్పం' వంటి సినిమాలు ఆమని నటనకు కొలమానంగా నిలుస్తాయి. సహజమైన ఆమె అభినయం ప్రేక్షకుల మనసులో ఆమెకి సుస్థిరమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. అలాంటి ఆమని కేరక్టర్ ఆర్టిస్ట్ గా మారిన దగ్గర నుంచి ముఖ్యమైన .. కీలకమైన పాత్రలనే చేస్తున్నారు.
తెలుగు తెరపై ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోయిన్స్ మధ్య గట్టి పోటీనే ఉంది. కీలకమైన కొన్ని పాత్రల కోసం సీనియర్ హీరోయిన్స్ నే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్స్ గా వెలిగినవారికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. అలాంటివారితో ఆమని ఇప్పుడు కూడా పోటీపడుతూ ఉండటం విశేషం. 'భరత్ అనే నేను' .. 'శ్రీనివాస కల్యాణం' .. 'శ్రీకారం' సినిమాలలో హీరోకి తల్లిగా ఆమె మంచి పాత్రలనే చేస్తూ వచ్చారు. ఆ సినిమాలోని ఆ పాత్రలు ఆమెకి మంచి గుర్తింపును తెచ్చాయి కూడా.
అయితే .. ఇటీవల ఆమని తన పాత్రల ఎంపిక విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదనే టాక్ వినిపిస్తోంది. వచ్చిన అవకాశాలను వరుసగా ఆమె ఒప్పేసుకుంటోందనీ, పాత్ర తీరుతెన్నులను ప్రాధాన్యతను పట్టించుకోవడం లేదని అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 'చావుకబురు చల్లగా' సినిమాలో ఆమని పోషించిన 'గంగమ్మ'పాత్ర ఆమె ఇమేజ్ ను కొంతవరకూ డ్యామేజ్ చేసిందనీ, ఇక రీసెంట్ గా వచ్చిన 'అర్థ శతాబ్దం' సినిమాలో 'రామన్న' భార్యగా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రను చేశారని అంటున్నారు. ఇకనైనా ఆమె తన పాత్రల ఎంపిక పై దృష్టిపెట్టవలసిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.