Begin typing your search above and press return to search.
రవితేజ - శ్రీను వైట్ల.. జీవన్మరణ పోరు ఇదీ..
By: Tupaki Desk | 30 Aug 2018 1:30 AM GMTవారిద్దరికీ ఇప్పుడు హిట్ అవసరం.. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆ ఇద్దరు ఇప్పుడు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. వారే హీరో రవితేజ.. దర్శకుడు శ్రీనువైట్ల.. ఈ ఇద్దరు నిలదొక్కుకునే సమయంలో తీసిన తొలి చిత్రం ‘నీకోసం’. 1999 డిసెంబర్ 3న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఆర్పీ పట్నాయక్ - దేవీ శ్రీప్రసాద్ సంగీతంతో ఈ చిత్రం పాటలు శ్రోతల మదిని దోచాయి. శ్రీనువైట్లకు తొలి హిట్ గా ఈ చిత్రం నిలిచింది.
రవితేజ.. మాస్ మహారాజ్ గా పాపులర్ అయ్యి అగ్రదర్శకులతో సినిమా చేశాడు. వరుస విజయాలు సొంతమైన వేళ గడిచిన రెండు మూడేళ్లుగా బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటీవలే రాజా ది గ్రేట్ మూవీ తప్ప మిగతా అన్ని సినిమాలు ఆడలేదు. దీంతో శ్రీనువైట్లతో తాజాగా తీసే ‘అమర్ అక్బర్ ఆంటోనీ ’ మూవీపైనే భారీ ఆశలు పెంచుకున్నాడు. ఈ సినిమా అటూ ఇటూ అయితే మాత్రం రవితేజ భవిష్యత్ అగమ్య గోచరంగా తయారవడం ఖాయం..
ఇక శ్రీనువైట్ల ప్రస్థానం అంచలంచెలుగా కొనసాగింది. రవితేజ తో 2004లో వెంకీ మూవీని శ్రీనువైట్ల తీశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 2007లో మరోసారి జతకట్టిన వీరు దుబాయ్ శీను మూవీ తీశాడు. ఇది బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. కానీ ఆ తర్వాత వీరిద్దరూ కాలం కలిసిరాక ఫ్లాపులు కొనితెచ్చుకున్నారు.
'ఢీ' - 'రెడీ' వంటి కామెడీ బేస్ డ్ సినిమాలతో వరుస విజయాలు చేజిక్కించుకున్న శ్రీనువైట్ల ఆ తరువాత మహేష్ బాబుతో 'దూకుడు' తీసి స్టార్ డైరెక్టర్ గా మారాడు.. అయితే ఈ సినిమాల్లోని నటులు - డైలాగులు ఒకే రీతిలో ఉండడం.. కామెడీ టైమింగ్ తర్వాతి సినిమాల్లో పోలికలతో ఉండడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. దూకుడు తరువాత మళ్లీ మహేష్ తో 'ఆగడు' సినిమా తీసినా అందులోనూ అర్థంకాని డైలాగ్ లు - రిపీట్ కామెడీ ఉండడంతో ఆ సినిమా ఆకట్టుకోలేదు. అప్పటి నుంచి శ్రీనువైట్ల వరుస ఫ్లాపులు కొనితెచ్చుకున్నాడు. శ్రీను వైట్లకు ఇప్పుడు హిట్ ఎంతో అవసరం..
శ్రీను వైట్ల తాజాజా 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాతో చాలా కాలం తరువాత వెండితెరకు వస్తున్నాడు. 'దూకుడు' సినిమా తరువాత ఒక్క హిట్టు సినిమా లేని ఆయన సినిమాల్లో ఒకే శైలి ఉండడంతో ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. దీంతో ఆ తరువాత 'మిస్టర్' అని లవ్ యాంగిల్ సినిమా తీశారు . అదికూడా అనుకున్న స్థాయిలో లేకపోవడంతో శ్రీనువైట్ల తన ట్రెండ్ ను ఈ సినిమాతో మార్చారని సన్నిహితులు చెబుతున్నారు. సినిమా కథ అద్భుతంగా ఉందని.. వేరే రైటర్లతో మాటలు రాయించాడని.. శ్రీనువైట్ల డిఫరెంట్ గా ఈ సినిమా తీస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో ట్విస్ట్ లతో పాటు యాక్షన్ సీన్స్ - కామెడీ ఎక్కువగా ఉంటాయంటున్నారు. అయితే అటు విజయాలు లేక కొట్టుమిట్టాడుతున్న రవితేజకు - ఇటు శ్రీను వైట్ల ఈ సినిమాపైనే గంపెడాశలు పెట్టుకున్నారు. దీని మీదే వారిద్దరి భవిష్యత్ ఆధారపడి ఉంది.