Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'అమరం అఖిలం ప్రేమ'
By: Tupaki Desk | 18 Sep 2020 7:30 AM GMTసాధారణంగా తెలుగులో ప్రేమకథల విషయానికి వస్తే మన దర్శకులు ప్రథమార్ధం వరకు ప్రేమ సన్నివేశాలు, కామెడీ సీన్లతో చకచకా నడిపించేస్తారు. లవ్ సీన్లను కొంచెం కొత్తగా చూపిస్తే.. మంచి పాటలు పెడితే చాలు. యూత్ కనెక్టయిపోతారు. ఇలా ఫస్టాఫ్ వరకు టైంపాస్ చేయించడం సులువే. ఐతే సినిమా మధ్యలోకి వచ్చాక అసలు కథ చెప్పాల్సి ఉంటుంది. కథను ఏదో ఒక రకంగా మలుపు తిప్పాల్సి ఉంటుంది. ద్వితీయార్దంలో ఎమోషన్ల మీద సినిమాను నడపాల్సి ఉంటుంది. ఇక్కడే దర్శకులు తడబడుతుంటారు. ప్రథమార్ధం వరకు మంచి ఫీలింగ్ ఇచ్చే ప్రేమకథలు.. ద్వితీయార్ధంతో తేలిపోతుంటాయి. దీంతో ముందున్న ఇంప్రెషన్ అంతా పోయి చివరికి వచ్చేసరికి ప్రేక్షకులు పెదవి విరుస్తుంటారు. ఐతే అల్లు వారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’లో విడుదలైన కొత్త సినిమా ‘అమరం అఖిలం ప్రేమ’ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.
ఇందులో హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్ దగ్గర్నుంచి.. లవ్ ట్రాక్ వరకు ప్రథమార్ధం అంతా చాలా బోరింగ్ గా.. రొటీన్ గా అనిపిస్తుంది. ఒక దశలో ఇదేం సినిమారా బాబూ అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. కానీ ఆశ్చర్యకరంగా మధ్యలోకి వచ్చాక.. ప్రేమ కథలో సంఘర్షణ మొదలైన దగ్గర్నుంచి ఈ చిత్రం ఆసక్తి రేకెత్తించడం మొదలుపెడుతుంది. సులువుగా లాగించేయడానికి వీలున్న ప్రేమ సన్నివేశాలన్నీ తేల్చేసి.. ఆ తర్వాత కథలో సంఘర్షణను, భావోద్వేగాలను బలంగా చూపించగలిగాడు కొత్త దర్శకుడు జొనాథన్ ఎడ్వర్డ్స్. ద్వితీయార్ధంలో పాత్రలతో పాటు సన్నివేశాల్లోనూ కనిపించే పరిణతి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిపోవడం కాదు, చివరికొచ్చేసరికి పూర్తి సంతృప్తీ ఉండదు కానీ.. ఉన్నంతలో కొంచెం బెటర్ ఫీలింగ్‌తోనే సినిమాను ముగించగలుగుతాం.
బుద్ధిగా చదువుకునే హీరోయిన్.. చదువు పూర్తి చేసి అల్లరి చిల్లరిగా అబ్బాయి.. అనుకోకుండా రోడ్డు మీద అమ్మాయిని చూసి ఫాలో అయిపోవడం.. తన వెంట అదే పనిగా తిరగడం.. ఆమె ఇల్లు కనుక్కుని అక్కడికి ఏదో ఒక కారణం మీద తరచుగా వెళ్తూ ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయడం.. హీరోయిన్ అతణ్ని దూరం పెట్టడం.. ఇలా ఒక దశ వరకు పరమ రొటీన్ గా సాగిపోతుంది ‘అమరం అఖిలం ప్రేమ’. హీరో ఎంత ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేసినా లొంగిపోని హీరోయిన్.. ‘నేను నిన్నే కాదు.. జీవితంలో ఏ కుర్రాడినీ ప్రేమించను’ అంటూ తన గతం వివరించడంతో ఈ కథ కొంచెం ఆసక్తి రేకెత్తించడం మొదలు పెడుతుంది. తనను ప్రాణంలా పెంచుకున్న తండ్రి.. తాను ఒక అబ్బాయి ప్రేమలో పడి, ఒక దశలో అతడితో వెళ్లిపోవడానికి సిద్ధపడినందుకు తనను అసహ్యించుకోవడం మొదలుపెట్టడంతో మళ్లీ ఆయన ప్రేమ గెలిచే క్రమంలో తనకిష్టమైన సివిల్స్ రాయడంపై దృష్టిపెడుతుంది కథానాయిక. ఈ క్రమంలో వేరే ఊరికి వస్తే అక్కడ హీరో ఆమె వెంట తిరగడం మొదలుపెడతాడు. ఈ గతం తెలిశాక హీరో ఏం చేశాడు.. అతడి ప్రవర్తన పట్ల హీరోయిన్ ఎలా స్పందించింది.. ఆమె లక్ష్యం ఏమైంది.. చివరికి వీళ్లిద్దరి కథకు ముగింపేంటి అన్నది మిగతా కథ.
ఐతే అప్పటిదాకా చూసిన సినిమాకు భిన్నంగా.. నడిచే ద్వితీయార్ధం ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హీరో పాత్ర ఉన్నట్లుండి చాలా మెచ్యూర్డ్ గా ప్రవర్తించడం మింగుడు పడదు. ఎందుకంటే అంతకుముందు అతను చేసేవన్నీ సిల్లీ సిల్లీ పనులే. ఐతే కొంత సమయం గడిచాక ఆ పాత్ర తీరుకు అలవాటు పడతాం. విశేషం ఏంటంటే.. ప్రథమార్ధంలో హీరో పాత్రకు తగ్గట్లే సన్నివేశాలు కూడా సిల్లీగా అనిపిస్తాయి. రెండో అర్ధానికి వచ్చేసరికి అతడి పాత్ర లాగే సన్నివేశాల్లోనూ మార్పు కనిపిస్తుంది. నెమ్మదిగా సినిమాకు కనెక్టవుతాం. లీడ్ యాక్టర్ల నటన సైతం ఒక్కసారిగా మారిపోయి ఆ పాత్రలతో కనెక్టవడం మొదలుపెడతాం. విజయ్ రామ్ - శివశక్తి లుక్స్ పరంగా యావరేజ్ గా కనిపిస్తారు. పాత్రలు - కథనం అంతంతమాత్రంగా ఉండటం వల్ల ఒక దశ వరకు వాళ్లతో కనెక్ట్ కావడమూ కష్టమవుతుంది. కానీ తర్వాత వాళ్లూ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్ కొన్ని సన్నివేశాల్లో ప్రదర్శించిన హావభావాలు ‘వావ్’ అనిపిస్తాయి. హిందీ సీరియళ్లలో మంచి అనుభవం ఉన్న శివశక్తి.. ఒకప్పుడు ‘కొత్త బంగారు లోకం’లో శ్వేతా బసు ప్రసాద్ ను గుర్తు తెస్తూ కొన్ని సన్నివేశాల్లో కట్టిపడేస్తుంది. హీరో హీరోయిన్ల తర్వాత శ్రీకాంత్ అయ్యంగార్ తనదైన ముద్ర వేశాడు. ‘ఆకాశమంత’ - ‘నువ్వే నువ్వే’ల్లో హీరోయిన్ తండ్రి పాత్రను పోలిన క్యారెక్టర్లో ఆయన ఆకట్టుకున్నారు. హీరో తండ్రిగా నరేష్ తన అనుభవాన్ని చూపించారు. అన్నపూర్ణమ్మ కూడా తన పాత్రను సమర్థంగా పోషించింది.
ఓవైపు మారిన తన వ్యక్తిత్వంతో అంతకంతకూ నచ్చేస్తున్న హీరో.. మరోవైపు నాన్న ప్రేమను పొందడానికి తాను సాధించాల్సిన లక్ష్యం.. ఈ సంఘర్షణ నేపథ్యంలో కథానాయిక పాత్రే ప్రధానంగా ద్వితీయార్ధం నడుస్తుంది. సింపుల్ సన్నివేశాలు.. చక్కగా పండిన భావోద్వేగాలతో ద్వితీయార్ధం చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది. కొన్ని రొటీన్ సన్నివేశాలు పడ్డా.. అక్కడక్కడా సాగతీతగా అనిపించినా.. చల్తా అనిపిస్తూ.. మంచి ముగింపుతో ఆకట్టుకుంటుంది ‘అమరం అఖిలం ప్రేమ’. దర్శకుడు ప్రథమార్ధం మీద దృష్టిపెట్టి కొంచెం కొత్తగా రాసుకుని ఉంటే.. రొటీన్-సిల్లీ సన్నివేశాలతో నింపేయకుంటే ‘అమరం అఖిలం ప్రేమ’ ఓవరాల్ గా మంచి సినిమానే అయ్యుండేది. బలాలు, బలహీనతలు సమానంగా ఉన్న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైతే చూడాలా వద్దా అన్న సంశయం కలిగించేది కానీ.. ఓటీటీలో కాబట్టి ఒకసారి చూడ్డానికి ఓకే. ప్రథమార్ధంలో మరీ చిరాగ్గా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వార్డ్ చేసుకునే అవకాశమూ ఉందిక్కడ.
చివరగా: పడి.. లేచే.. 'అమరం అఖిలం ప్రేమ'
(ఈ సినిమాను నిర్మించింది సుకుమార్ ఆప్త మిత్రుడైన ప్రసాద్ కావడం విశేషం. ఐతే తన తొలి సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం ఆశగా ఎదురు చూసిన ఆయన.. కొన్ని నెలల కిందట హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడీ చిత్రం ‘ఆహా’లోకి వచ్చింది. ఈ చిత్రంలో నరేష్ తో కలిసి ఒక చిన్న సన్నివేశాన్ని కూడా పంచుకున్నారాయన)