Begin typing your search above and press return to search.
'ఎన్టీఆర్' ను కొనేసిన అమెజాన్?
By: Tupaki Desk | 17 Sep 2018 5:48 AM GMTవిశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ పై బయోపిక్ తెరకెక్కిస్తున్నారు అనగానే అందరిలోనూ ఒకటే ఆసక్తి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ నేషనల్ ఫిగర్ కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు జాతీయ స్థాయిలోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ రాజకీయ చరిత్రతో పాటు - కాంగ్రెస్ కుహానా రాజకీయాల్ని - నాదెండ్ల వెన్నుపోటు రాజకీయాల్ని చూపిస్తారని ప్రచారమైంది. దీంతో ఇంకా ఇంకా ఉత్కంఠ రెయిజ్ అయ్యింది. సరిగ్గా ఇదే పాయింట్ ఎన్టీఆర్ బయోపిక్ కి మార్కెట్ పరంగా హైప్ పెంచేలా చేసింది. ఈ సినిమాని తెలుగు - తమిళ్ - హిందీ భాషల్లో రిలీజ్ చేసి క్యాష్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది.
ఇదే ఆలోచనతో ప్రఖ్యాత ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ `ఎన్టీఆర్` బయోపిక్ డిజిటల్ రిలీజ్ హక్కుల్ని ఛేజిక్కించుకుందని ప్రచారం సాగుతోంది. దాదాపు 15 కోట్ల మేర డీల్ మాట్లాడుతున్నారన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతానికి చర్చలు సాగుతున్నాయి. ఎంత అన్నదానిపై అధికారికంగా స్పష్ఠత రావాల్సి ఉందింకా. అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ - హాట్ స్టార్ వంటి ఆన్ లైన్ దిగ్గజాలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ డిజిటల్ హక్కుల పరంగా పోటీ పెంచడం అన్ని సినిమాలకు కలిసొస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ చిత్రానికి డిజిటల్ హక్కుల విషయంలో తీవ్రమైన పోటీ నెలకొందని తెలుస్తోంది.
మరోవైపు ఈ బయోపిక్ ని తనదిగా వోన్ చేసుకుని క్రిష్ స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు. కెరీర్ పరంగా ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. డైలాగ్ రచయిత బుర్రా సాయిమాధవ్ 24/7 క్రిష్ కి అందుబాటులో ఉన్నారు. ప్రతిదీ అతడితో కూలంకుశంగా చర్చించి క్రిష్ ఆన్ లొకేషన్ పని చేస్తున్నారట. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ - నారా చంద్రబాబు నాయుడుగా -రానా - హరికృష్ణ గా- కళ్యాణ్‌రామ్ - ఏఎన్నార్ గా - సుమంత్ - బసవతాకం పాత్రలో - విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది.