Begin typing your search above and press return to search.

అమెజాన్ న‌మ్మ‌కం: రిస్క్ తీసుకుంటేనే ర‌స్క్!

By:  Tupaki Desk   |   12 Feb 2022 11:31 AM GMT
అమెజాన్ న‌మ్మ‌కం: రిస్క్ తీసుకుంటేనే ర‌స్క్!
X
ఓటీటీ వ్య‌వ‌స్థ‌ డే బై డే ఎలా విస్త‌రిస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. నేరుగా సినిమాని ఓటీటీకే క‌ట్ట‌బెడ‌తామంటే కోట్ల రూపాయ‌లు గుమ్మ‌రించ‌డానికి కార్పోరేట్ ఓటీటీ కంపెనీలు రెడీగా ఉన్నాయి. అయితే సినిమా బాగుండి హిట్టైతే అంత‌కు మించిన లాభాలు థియేట్రిక‌ల్ రిలీజ్ లో ద‌క్కుతాయ‌న్న చిన్న ఆశ‌తో మెజార్టీ వ‌ర్గం థియేట‌ర్ రిలీజ్ కే మొగ్గు చూపుతుంది. సినిమా భ‌విష్య‌త్ మాత్రం ఓటీటీదే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓ సినిమా రిలీజ్ కోసం ఏకంగా 100 కోట్లు వెచ్చించింది. ఎన్నో ఓటీటీ కార్పోరేట్ సంస్థ‌లు పోటీగా వ‌చ్చినా అమెజాన్ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా 100 కోట్లు కోట్ చేసి రైట్స్ ద‌క్కిచుకుంది .

ఇంత‌కీ ఆ సినిమా ఏంటి? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. సిద్దాంత్ చ‌తుర్వేది..దీపికా ప‌దుకొణే..అన‌న్య పాండే ప్ర‌ధాన పాత్ర‌ల్లో `గెహ్రైయాన్` తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయింది.

ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ కే అమెజాన్ ప్రైమ్ 100 కోట్లు పెట్టిన‌ట్లు తెలిసింది. అన్ని ర‌కాల రైట్స్ కి ఏకంగా 100 కోట్ల‌కు లాక్ చేసింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ఓటీటీ సంస్థ ఇన్ని కోట్లు పెట్టి సినిమాని విక్ర‌యించింది లేదు. తొలిసారి అమెజాన్ ప్రైమ్ `గెహ్రైయాన్` కోసం 100 కోట్లు వెచ్చించ‌డం షాకింగ్ విష‌య‌మే. దీపిక మిన‌హా భారీ తార‌గాణం..టెక్నిక‌ల్ స్టాండ‌ర్స్ట్ ఉన్న సినిమా కూడా కాదు. అయినా కంటెంట్ పై న‌మ్మ‌కంతో స‌ద‌రు సంస్థ ఎక్క‌డా రాజీకి రాలేదు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఏ భార‌తీయ సినిమా ఇంత ధ‌ర‌కు ఓటీటీలో అమ్మ‌డు పోలేదు. ప్ర‌స్తుతం హిందీ..తెలుగు చిత్రాలు బ‌డ్జెట్ ప‌రంగా హైలో ఉన్నాయి. ఒక్కో సినిమాకు 100 కోట్ల‌కు పైగానే యావ‌రేజ్ గా ఖ‌ర్చు చేస్తున్నాయి.

మీడియం రేంజ్ సినిమాలంటే 20 నుంచి 40 కోట్ల మ‌ధ్య‌లో నిర్మాణం జ‌రుగుతున్నాయి. ఆలెక్క‌న చూసుకుని ఓటీటీ కొనుగోలు చేసిన ఫిగ‌ర్ చూస్తే గెహ్రైయాన్ కి పెద్ద బ‌డ్జెట్ చిత్రం కాద‌ని చెప్పొచ్చు. ఈ చిత్రానికి శ‌కున్ బాత్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్..వ‌యోకామ్ 18 స్టూడియోస్..జౌస్కా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి.