Begin typing your search above and press return to search.

డైరెక్ట్ ఓటీటీ రిలీజుల విషయంలో లోపం ఎక్క‌డ జరుగుతోంది...?

By:  Tupaki Desk   |   2 Oct 2020 11:30 AM GMT
డైరెక్ట్ ఓటీటీ రిలీజుల విషయంలో లోపం ఎక్క‌డ జరుగుతోంది...?
X
ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా కొనసాగుతోంది. జనాలు ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ మూవీస్.. వెబ్ సిరీస్ లు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ మూతబడిపోవడంతో కొత్త సినిమాలు కూడా ఓటీటీలలోనే డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కాస్త ముందున్నారని చెప్పవచ్చు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను కొనుక్కొని స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. అయితే రీజినల్ సినిమాల డీల్స్ విషయంలో మాత్రం అమెజాన్ ప్రైమ్ సక్సెస్ కాలేకపోతోందని ఓటీటీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయంలో అమెజాన్ ప్రైమ్ వారి లెక్కలు తప్పుతున్నాయి అంటున్నారు.

ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఏ సినిమాకి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. కొన్ని సినిమాలకు మిశ్రమ స్పందన రాగా.. మరికొన్ని నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా స్ట్రీమింగ్ అవుతున్న 'నిశ్శ‌బ్దం' చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ నుంచి.. విశ్లేషకుల నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు అమెజాన్ టీమ్ సినిమాలను తీసుకునే విషయంలో లోపం ఎక్క‌డ జ‌రిగిందో వెతికే ప‌నిలో ప‌డ్డారట. తెలుగు సినిమాల‌కి సంబంధించి ఇక్కడ లోక‌ల్ గా అమెజాన్ టీమ్ ని ఎవరు గైడ్ చేస్తున్నారో కానీ.. డైరెక్ట్ ఓటీటీ రిలీజుల విష‌యంలో ఫెయిల్ అవుతూనే ఉన్నారని కామెంట్స్ వస్తున్నాయి.

ఏ సినిమాని కొనాలి? ఏ సినిమాకి ఎంత పెట్టొచ్చు? అనే విషయాలపై అవగాహన లేకపోవడంతో ఇలా జరుగుతుందని.. ఇలానే కొన‌సాగితే తెలుగు సినిమాల్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయ‌డంలో కొన్నాళ్లు ఆపేయ‌వ‌చ్చ‌ని ఓటీటీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 15 తర్వాత థియేట‌ర్లు ఓపెన్ అవుతున్న నేప‌థ్యంలో కూడా అమెజాన్ ప్రైమ్ వారు దేశ‌వ్యాప్తంగా అన్ని భాష‌ల్లో కలిపి మ‌రో 8 సినిమాలను డైరెక్ట్ ఓటీటీ ప‌ద్ధ‌తిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారని సమాచారం. మరి అందులో తెలుగు సినిమాలు ఉన్నాయో లేవో తెలియాల్సి ఉంది.