Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ లవర్స్ కి ఆమెజాన్ గుడ్ న్యూస్
By: Tupaki Desk | 31 May 2022 12:31 PM GMTరాఖీభాయ్ యష్ నటించిన తాజా సంచలనం `కేజీఎఫ్ 2`. ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల ఐదు భాషల్లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా విడుదలై నెల దాటినా ఇప్పటికీ తన హవాని కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద దేశ వ్యాప్తంగా సందడి చేస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడలోనూ రికార్డులు తిరగరాసిన ఈ మూవీ ఉత్తరాదిలో మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
అక్కడ 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన `దంగల్` నే వెనక్కి నెట్టింది. వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో 1200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. ఇక దేశ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది ప్రేక్షకులు థియేటర్లలో చూసిన సినిమాగా రికార్డుని నెలకొల్పిన ఈ మూవీ బుక్ మై షోలో అత్యధిక టికెట్ లు అమ్ముడు పోయిన సినిమాగా సరికొత్త రికార్డుని సొంతం చేసుకుని `బాహుబలి 2` ని వెనక్కి నెట్టింది.
దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీని చడీ చప్పుడ కాకుండా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టారు. థియేటర్లోలో స్టిల్ రన్నవుతున్న ఈమూవీని ఓటీటీలో చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సైలెంట్ గా స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టిన అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని చూడాలంటే అదనంగా సబ్స్ స్క్రైబర్స్ రూ. 199 కట్టాల్సిందే అంటూ నిబంధనని పెట్టి షాకిచ్చింది.
ఏడాది సబ్స్ స్క్రిప్షన్ కింద నూ 1499 పే చేసిన తమకు అమెజాన్ ఇలా చేయడం నచ్చలేదని పలువురు సబ్స్ స్క్రైబర్స్ అమెజాన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అయినా సరే పట్టించుకోని ఆమెజాన్ `కేజీఎఫ్ 2` ఇన పే పర్ వ్యూ పంథాలోనే స్ట్రీమింగ్ చేస్తూ వచ్చింది. అయితే తాజా ఆ పంథాని పక్కన పెట్టేసి జూన్ 3 నుంచి సబ్స్ స్క్రైబర్స్ ఈ మూవీని ఫ్రీగా చూడొచ్చంటూ గుడ్ న్యూస్ చెప్పేసింది. దీంతో రాఖీభాయ్ ఫ్యాన్స్, సబ్స్ స్క్రైబర్స్ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.