Begin typing your search above and press return to search.

పద్మావతికి పాతిక కోట్లిచ్చేశారు

By:  Tupaki Desk   |   2 Nov 2017 10:22 AM GMT
పద్మావతికి పాతిక కోట్లిచ్చేశారు
X
పద్మావతి సినిమా మొదలైనపుడు.. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు ఎవరికీ పెద్దగా పట్టలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాతో బన్సాలీ ఏం మ్యాజిక్ చేస్తాడులే అనుకున్నారు. చరిత్ర వక్రీకరిస్తున్నారంటూ ఓ వర్గం బన్సాలీ టీం మీద ఒకటికి రెండు సార్లు దాడికి ప్రయత్నించడంతో అలాంటి నెగెటివ్ విషయాలతో మాత్రమే వార్తల్లో నిలిచిందీ సినిమా. కానీ గత నెలలో ‘పద్మావతి’ ట్రైలర్ రిలీజవ్వగానే మొత్తం సీన్ మారిపోయింది. ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందెన్నడూ చూడని స్థాయిలో అద్భుతమైన విజువల్స్‌ తో ఈ ట్రైలర్ కట్టిపడేసింది. ఓ గొప్ప సినిమా చూడబోతున్న భావన కలిగించింది.

‘పద్మావతి’ ట్రైలర్ వచ్చాక ఈ సినిమా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై అమితాసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఏకంగా రూ.25 కోట్లు పెట్టి ‘పద్మావతి’ డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకోవడం విశేషం. సినిమా రిలీజయ్యాక టాక్‌ను బట్టి డిజిటల్ హక్కులు తీసుకోవడం మామూలే. కానీ విడుదలకు నెల రోజుల ముందే రూ.25 కోట్ల ఫ్యాన్సీ రేటు పెట్టి హక్కులు తీసుకున్నారంటే ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు రూ.200 కోట్ల దాకా పలుకుతున్నట్లు సమాచారం. మిగతా హక్కులన్నీ కలిపి కనీసం రూ.50 కోట్లు తెచ్చే పెట్టే అవకాశాలున్నాయి.