Begin typing your search above and press return to search.
సైరా-ఒక్క దెబ్బకు 30 కోట్లు
By: Tupaki Desk | 4 March 2018 4:16 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కానే లేదు. సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి నుంచి మార్చ్ కి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. హీరొయిన్ నయనతార ఎంట్రీతో ఇది కొనసాగనుంది అనే వార్తల నేపధ్యంలో ఎప్పటి నుంచి అనే క్లారిటీ మాత్రం రావడం లేదు. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులు కనివిని ఎరుగని స్థాయిలో అమ్ముడయ్యాయి అనే వార్త విని మెగా ఫాన్స్ ఆనందం పట్టలేకపోతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సైరా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ 30 కోట్లకు కొనుగోలు చేసిందనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఈ న్యూస్ గతంలోనే ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు అగ్రిమెంట్ జరిగినట్టు టాక్. ఖైది నెంబర్ 150తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన చిరు స్టార్ యూత్ హీరోలకు ధీటుగా ఇంత రేట్ రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. ఇది మా మెగాస్టార్ అంటూ దీన్ని వైరల్ చేస్తున్నారు ఫాన్స్.
టాలీవుడ్ మాత్రమే కాక తమిళ - కన్నడ - హింది సినిమాల నిర్మాతలకు అమెజాన్ ప్రైమ్ ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. విడుదలైన 28 రోజులకే తమ యాప్ లో స్ట్రీమింగ్ పెట్టేలా ఒప్పందం చేసుకుంటున్న ఈ సంస్థ విన్నర్ నుంచి లేటెస్ట్ హిట్ భాగమతి దాకా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది. పైగా సినిమా ప్రమోషన్ నుంచే టీజర్లలో సైతం తమ లోగో ఉండేలా ప్రమోట్ చేసుకుంటోంది. త్వరలో విడుదల కానున్న క్రేజీ మూవీస్ రంగస్థలం - భరత్ అనే నేను కూడా అమెజాన్ ప్రైమ్ ఖాతాలో ఉన్నాయి. ఇవి కూడా 28 రోజులకే విడుదల చేసేలా ఒప్పందం జరిగిందా లేక గడువు పోడిగించారా అనేది తెలియాల్సి ఉంది.
ఇక అమెజాన్ ప్రైమ్ చేసుకున్న ఒప్పందంలో మొత్తం డిజిటల్ రైట్స్ అన్ని ఉన్నాయట. ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలు కొని మేకింగ్ వీడియోస్ దాకా పూర్తి సినిమాను తమ వెబ్ సైట్ లో ఉంచడం వరకు అన్ని ఇందులో మాట్లడుకున్నారని తెలిసింది. శాటిలైట్ మరో 30 దాకా పలకొచ్చు అనే అంచనా కూడా ఉంది. మొత్తంగా సగానికి పైగా బడ్జెట్ ఇలా హక్కుల రూపంలోనే రాబడుతున్న సైరా ముందు ముందు ఇంకెన్ని సంచలనాలకు వేదికగా మారనుందో చూడాలి.