Begin typing your search above and press return to search.

జాను కొంపముంచిన అమెజాన్?

By:  Tupaki Desk   |   12 Feb 2020 5:15 PM IST
జాను కొంపముంచిన అమెజాన్?
X
శర్వానంద్-సమంతా ప్రధాన పాత్రలలో నటించిన 'జాను' తమిళ సూపర్ హిట్ '96' కు రీమేక్ అనే సంగతి తెలిసిందే. తమిళంలో క్లాసిక్ స్టేటస్ తెచ్చుకున్న ఈ సినిమాకు తెలుగులో ఆదరణ దక్కదు అనే విషయం మాత్రం ఎక్కువమంది ఊహించలేకపోయారు. ఇప్పుడు 'జాను' కు వస్తున్న కలెక్షన్స్ చూసి వారందరూ నివ్వెరపోతున్నారు.

నిజానికి 'జాను' సినిమా చూసినవారు బాగలేదని మాత్రం చెప్పడం లేదు. స్లో గా ఉందని.. మరొకటని కారణాలు చెప్తున్నారు కానీ ఇలా ఫ్లాప్ అవ్వాల్సిన కంటెంట్ మాత్రం కాదని అంటున్నారు. మరి ఏం జరిగింది? ఈ నిరాశాజనకమైన ఫలితానికి చాలా కారణాలు ఉన్నట్టుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి కానీ 'జాను' టీమ్ మాత్రం ముఖ్యంగా ఈ సినిమాకు దక్కిన ఫలితానికి ముఖ్యమైన కారణం 'అమెజాన్ ప్రైమ్' అనే ఆలోచనలో ఉన్నారట.

తమిళ చిత్రం '96' అమెజాన్ లో అందుబాటులో ఉండడంతో మాటీవీ ప్రేక్షకులు 'అతడు' సినిమాను చూసినట్టుగా విరక్తి పుట్టేవరకూ చూశారని.. దీంతో తెలుగు వెర్షన్ థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. 'జాను' టీమ్ కూడా ఇదే అసలు కారణమని నమ్ముతున్నారని ఇన్సైడ్ టాక్. ఒకవేళ ఈ కారణమే నిజమైతే మాత్రం ఫ్యూచర్ లో ఏదైనా సినిమాను రీమేక్ చేసే సమయంలో అమెజాన్ లో ఉందా.. నెట్ ఫ్లిక్స్ లో ఉందా అని చూసుకుని మరీ రైట్స్ కొనక తప్పేలా లేదు.