Begin typing your search above and press return to search.

డిజిట‌ల్ యూట‌ర్న్.. నిర్మాత‌లే భేజారే!

By:  Tupaki Desk   |   25 Nov 2019 2:30 PM GMT
డిజిట‌ల్ యూట‌ర్న్.. నిర్మాత‌లే భేజారే!
X
డిజిట‌ల్ రాక‌తో స‌న్నివేశం అంతా రివ‌ర్సులో ఉంది. టాలీవుడ్ లో ఊపు పెరిగింది. సినిమా రిలీజ్ ముందే అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ లాంటి కంపెనీలు భారీ మొత్తాల్ని వెద‌జ‌ల్లి తెలుగు సినిమాల రైట్స్ ని కొనుక్కుంటున్నాయి. దీంతో నిర్మాతకు అది పెద్ద ఊర‌ట‌గా క‌నిపిస్తోంది. అయితే ఈ ట్రెండ్ ఇక‌పైనా కొన‌సాగుతుందా? అంటే సందేహ‌మేన‌ని తాజా స‌మాచారం. టాలీవుడ్ నిర్మాత‌ల‌కు షాకిచ్చే మ‌రో కొత్త సంగ‌తి లేటెస్టుగా తెలిసింది.

ఇటీవ‌లే డిజిట‌ల్ లో రిలీజైన సాహో- సైరా లాంటి చిత్రాల‌కు డిజిట‌ల్ వ్యూయ‌ర్ షిప్ ఆశించినంత రాక‌పోవ‌డంతో వాటిని స్ట్రీమింగ్ చేసిన అమెజాన్ షాక్ తింద‌ట‌. భారీ మొత్తాల్ని వెచ్చించి కొనుక్కుని లైవ్ స్ట్రీమింగ్ చేస్తే అక్క‌డ స‌రిగా జ‌నాద‌ర‌ణ ద‌క్క‌క‌పోవ‌డంతో షాక్ కి గురైంద‌ట‌. దీంతో అమెజాన్ ఆలోచ‌న‌లు ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్నాయ‌ని తెలుస్తోంది. దీంతో అమెజాన్ ప్రైమ్ కొత్త బిజినెస్ మోడ‌ల్ ని డిజైన్ చేస్తోంద‌ని తెలిసింది.

ఇక‌పై తెలుగు సినిమాల్ని డైరెక్టుగా బేర‌మాడి కొన‌ద‌లిస్తే ధ‌ర‌ల్ని అమాంతం త‌గ్గించేస్తుంద‌ట‌. అలాగే లైవ్ స్ట్రీమింగ్ కి వ‌చ్చాక సాధించే వ్యూస్ తోనూ మెలిక పెట్ట‌బోతోంద‌ట‌. అంటే ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను బ‌ట్టి కూడా చెల్లింపులు సాగేలా ఒక కొత్త‌ బిజినెస్ మోడ‌ల్ ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే మ‌న నిర్మాత‌ల‌కు చిక్కులు త‌ప్ప‌వు. మ‌రోసారి డిజిట‌ల్ ధ‌ర‌లు డౌన్ ట్రెండ్ లోకి వెళితే ఆ మేర‌కు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.