Begin typing your search above and press return to search.
MB 26 లాంచ్ అవ్వకుండానే బేరమా?
By: Tupaki Desk | 20 May 2019 6:37 AM GMTసూపర్ స్టార్ మహేష్ `దూకుడు` చూశారా? ఆయన్ను మించిన దూకుడు చూపిస్తోంది అమెజాన్. తొలి నుంచి మహేష్ సినిమాల డిజిటల్ రైట్స్ ని భారీ ధరలకు గంపగుత్తగా కొనేస్తున్న ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ మరోసారి అదే దూకుడు చూపిస్తోంది. ఈసారి `దూకుడు స్క్వేర్` అని డిక్లేర్ చేయాలేమో! ఇంకా సినిమా మొదలెట్టనే లేదు. అప్పుడే MB 26 సినిమాని ఖాతాలో వేసేసుకుంటోంది ఈ సంస్థ. ప్రత్యర్థి కి అస్సలు ఛాన్స్ ఇచ్చేందుకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వడంలేదు. ఓవైపు నెట్ ఫ్లిక్స్.. హాట్ స్టార్ సహా పలు ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థలు మహేష్ సినిమాని కొనుక్కోవాలని కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నాయట. కానీ ఈలోగానే ఇలా అందరికంటే ముందే కర్ఛీఫ్ వేసి బేరం ఖాయం చేసుకోవడం చూస్తే మతి చెడుతోంది.
అయితే అమెజాన్ ఇంత అడ్వాన్స్ డ్ గా ఉండడానికి కారణం.. లాజిక్ కూడా అంతే గమ్మత్తుగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ కెళ్లేందుకు రెడీ అవుతున్న మహేష్ 26వ సినిమాపై భారీ బెట్టింగ్ నడవబోతోంది. ఈ చిత్రానికి ప్రీబిజినెస్ పీక్స్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. 100 పర్సంట్ సక్సెస్ రేటు ఉన్న అనీల్ రావిపూడి దర్శకత్వం వహించడం కూడా మార్కెట్ రేంజును పెంచింది. ఆ క్రమంలోనే ఇంకా వేచి చూస్తే రేటు పెంచేస్తారే కానీ.. తగ్గించేది ఉండదు. అందుకే ఇలా తెలివిగా ప్లాన్ చేసిందట అమెజాన్. ఎఫ్ 2 లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో అనీల్ రావిపూడి దూకుడు మీదున్నాడు. మహర్షి సక్సెస్ టాక్ తో పోకిరి స్క్వేర్ అంటూ మహేష్ దూకుడు చూపిస్తున్నారు. మహేష్ తో బ్లాక్ బస్టర్ దూకుడు తీసారు కాబట్టి నిర్మాత అనీల్ సుంకర అంతే దుందుడుకుమీదున్నారు. అందుకే ఈ దూకుడు ఇంకా పెరగక ముందే అమెజాన్ కర్చీఫ్ వేసేసిందట. ప్రస్తుతం రేటు మాట్లాడుకుంటున్నారని తెలిసింది. అనీల్ సుంకర కాస్తంత పెద్ద మొత్తమే డిమాండ్ చేస్తున్నారట.
ఈ దూకుడు సాటెవ్వరూ..!! అంటూ అందరి కంటే ముందే ముందు చూపుతో దూసుకుపోతున్న అమెజాన్ స్పీడ్ గురించి ఫిలింనగర్ లో వేడిగా చర్చ సాగుతోంది. మహర్షి చిత్రాన్ని డిజిటల్ రైట్స్ దాదాపు 11 కోట్లకు కొనుక్కుంది అమెజాన్. ఇప్పుడు అంతకుమించి MB 26 చిత్రానికి చెల్లించనుందనే అంచనా వేస్తున్నారు. మరోవైపు మహర్షి ప్రచార కార్యక్రమాలు పూర్తి చేసుకుని .. మహేష్ కుటుంబ సమేతంగా విదేశాలకు వెకేషన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అట్నుంచి వస్తూనే అనీల్ రావిపూడి & టీమ్ తో జాయిన్ అవుతారు. జూన్ లో సినిమాని ప్రారంభించి .. 2020 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.