Begin typing your search above and press return to search.

పుష్ప ఫ్యాన్స్ రెస్పాన్స్ కు అమెజాన్‌ టీమ్ అశ్చర్యం

By:  Tupaki Desk   |   11 Jan 2022 4:31 AM GMT
పుష్ప ఫ్యాన్స్ రెస్పాన్స్ కు అమెజాన్‌ టీమ్ అశ్చర్యం
X
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా 2021 సంవత్సరానికి గాను ఇండియాస్ బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పుష్ప సందడి 2022 లోనూ కనిపిస్తుంది. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకున్న పుష్ప ను విడుదల అయిన మూడు వారాల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేశారు. సాదారణంగా అయితే నాలుగు వారాల తర్వాత ఈమద్య ఓటీటీ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. కాని ఓటీటీ స్ట్రీమింగ్‌ విషయంలో పుష్ప తగ్గేదే లే అన్నట్లుగా దూసుకు పోయాడు. సౌత్‌ భాషల్లో మాత్రమే అమెజాన్ ప్రైమ్‌ కు పుష్ప మేకర్స్ స్ట్రీమింగ్‌ కు అవకాశం కల్పించారు. హిందీ స్ట్రీమింగ్ కోసం ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కోహ్లీ నుండి కరణ్‌ జోహార్ వరకు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు మరియు క్రీడా ప్రముఖులు పుష్ప ను ఆహా ఓహో అంటూ ప్రశంసలు కురిపించారు. దాంతో పుష్ప సినిమా ను ఎప్పుడెప్పుడు హిందీలో స్ట్రీమింగ్‌ చేస్తామా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ సమయంలో అమెజాన్‌ ప్రైమ్‌ వారు పుష్ప ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నట్లయితే ఈ ట్వీట్‌ ను రీ ట్వీట్‌ చేయండి... 15 వేల రీ ట్వీట్స్ అయితే పుష్ప స్ట్రీమింగ్‌ అప్డేట్‌ ఇస్తాం అన్నట్లుగా ట్వీట్‌ చేయడం జరిగింది. కొన్ని గంటల వ్యవధిలోనే 15 వేలు కాదు ఏకంగా 17 వేల రీ ట్వీట్స్ ను బన్నీ ఫ్యాన్స్ చేయడం జరిగింది. బన్నీ అభిమానులు ఏ స్థాయిలో పుష్ప హిందీ వర్షన్ కోసం వెయిట్‌ చేస్తున్నారో చూసి అమెజాన్ టీమ్‌ సైతం ఆశ్చర్య పోయి ఉంటారు.

అమెజాన్‌ ప్రైమ్‌ సోషల్‌ మీడియా టీమ్‌ పుష్ప డైలాగ్స్ ను తగ్గేదే లే.. పుష్ప అంటే ప్లవర్ కాదు ఫైర్‌ అన్న డైలాగ్‌ ను షేర్‌ చేసి అభిమానుల ఉత్సాహంను మరింతగా పెంచింది. ఏ క్షణంలో అయినా పుష్ప స్ట్రీమింగ్‌ కు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వారంలోనే హిందీ పుష్ప వస్తుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి పుష్ప సినిమా ఒక వైపు థియేటర్‌ లో ఆడుతూనే మరో వైపు ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవ్వడం అరుదైన సంఘటనగా చెప్పుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప ఇంకా కొన్ని థియేటర్లలో ఉంది. ఓటీటీ లో కూడా లక్షల మంది పుష్ప ను తెగ చూసేస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ లోనే హిందీ కూడా స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. అన్ని భాషల వర్షన్‌ ల పుష్ప ను దక్కించుకున్న అమెజాన్‌ ప్రైమ్‌ అందుకు గాను భారీ మొత్తంను నిర్మాతలకు కట్టబెట్టిందనే సమాచారం అందుతోంది.