Begin typing your search above and press return to search.

కరోనా టైంలో ఆ రెంటి మద్య పోటీ తారా స్థాయికి

By:  Tupaki Desk   |   16 July 2020 2:30 PM GMT
కరోనా టైంలో ఆ రెంటి మద్య పోటీ తారా స్థాయికి
X
ఇండియాలో ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ ఫుల్‌ ఫామ్‌ లోకి రావాలంటే కనీసం అయిదు నుండి పది సంవత్సరాలు పడుతుందని ఈ ఏడాది ఆరంభం వరకు అంతా అనుకున్నారు. కాని కరోనా కారణంగా అప్పటి వరకు కాకుండా ఇప్పుడే ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ బిజినెస్‌ విపరీతంగా పెరిగింది. మొన్నటి వరకు ఓటీటీ లకు పాత సినిమాలకు కేంద్రం అయిన ఇవి ఇప్పుడు కొత్త సినిమాలను వరుసగా విడుదల చేస్తున్నాయి. ప్రముఖ ఓటీటీలు అయిన నెట్‌ ప్లిక్స్‌ అమెజాన్‌ జీ5 హాట్‌ స్టార్‌ ఇంకా మరి కొన్ని కూడా అన్ని భాషల సినిమాలను భారీ మొత్తాలకు కొనుగోలు చేసి విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నాయి.

థియేటర్లు మూత పడి నాలుగు నెలు అవుతుంది. మరికొన్నాళ్ల పాటు ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ అయిన నెట్‌ ప్లిక్స్‌ ఇంకా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోల మద్య పోటీ తారా స్థాయికి చేరింది. ఈ రెండు ఓటీటీలు కూడా కొత్త సినిమాల కొనుగోలు విషయంలో దూకుడుగా ఉంటున్నాయి. నిర్మాతలకు ఈ రెండు ఓటీటీలు కూడా కాసులు కురిపిస్తున్నాయి. కోటాను కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలను ఈ ఓటీటీలు కొనుగోలు చేస్తున్నాయి.

నెట్‌ ఫ్లిక్స్‌ ఇటీవల హిందీలో పెద్ద సినిమాలు కలిపి మొత్తంగా 17 సినిమాలను కొనుగోలు చేసింది. వాటిని వారంకు ఒక్కటి రెండు చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాల కోసం నెట్‌ ప్లిక్స్‌ భారీ మొత్తంను వ్యచ్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాల స్ట్రీమింగ్‌ తో తమ వినియోగదారుల సంఖ్య 20 నుండి 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నెట్‌ ప్లిక్స్‌ భావిస్తుంది. ఇదే సమయంలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కూడా భారీగా సినిమాలను కొనుగోలు చేసేందుకు రెడీ అవుతుంది. త్వరలోనే పది సినిమాలను అమెజాన్‌ వారు ప్రకటించనున్నారట.

నెట్‌ ప్లిక్స్‌ కొనుగోలు చేసిన సినిమాల్లో ప్రధానమైనవి.. గుంజన్‌ సక్సేనా... తొర్భాజ్‌.... డాలీ కిట్టి ఔర్‌ వో... లూడో.. క్లాస్‌ ఆఫ్‌ 83... గన్నీ వెడ్స్‌ సన్నీ... మిస్‌ మ్యాచ్డ్‌.... ఏకే వర్సెస్‌ ఏకే.... సీరియస్‌ మెన్‌..... భాగ్‌ మినీ భాగ్‌... బాంబే బేగమ్స్‌ ఇంకా కొన్ని సినిమాలతో పాటు మొత్తం 17 సినిమాలను విడుదల చేయబోతున్నట్లుగా నెట్‌ ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది.