Begin typing your search above and press return to search.
'V' టీమ్ బజ్ మెయింటైన్ చేయలేకపోతోందా...?
By: Tupaki Desk | 3 Sep 2020 3:00 PM GMTనేచురల్ స్టార్ నాని - సుధీర్ బాబు నటించిన యాక్షన్ థ్రిల్లర్ ''వి''. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ - హర్షిత్ రెడ్డి నిర్మించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా రూపొందిన 'వి' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి - నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో 'వి' చిత్రాన్ని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాపై 'V' టీమ్ బజ్ మెయింటైన్ చేయలేకపోయారని.. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రేక్షకులకు రీచ్ అవలేదని అమెజాన్ వారు అసంతృప్తిగా ఉన్నట్లు ఓటీటీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
కాగా ఇప్పటి వరకు ఓటీటీలలో విడుదలైన తెలుగు సినిమాలన్నీ అంతగా క్రేజ్ లేని హీరోలు నటించినవి.. చిన్న మీడియం బడ్జెట్ తో తెరకెక్కినవే. అయితే నాని - సుధీర్ బాబు నటించిన 'వి' సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డేరింగ్ స్టెప్ వేసాడని.. మార్పు రావాలంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలని.. 'వి' టీమ్ ఆ పని చేసిందని ఇండస్ట్రీ జనాల్లో కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు మాత్రం అంతా సైలెంట్ అయిపోయారు.
సినిమా ఎంత కష్టపడి తీసినా ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేయాలన్నా సోషల్ మీడియాతో పాటు ప్రసారమాద్యమాల సహకారం కూడా ఎంతో అవసరం. ఇంతకముందు సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందంటే హీరో హీరోయిన్స్ తో ప్రెస్ మీట్స్ పెట్టించడం.. టీవీ ఛానల్ లైవ్ లోకి రావడం.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడం.. ఇలా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు హంగామా నడుస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటీ సినిమాలకు అవేమీ లేవు. ఇక 'వి' సినిమా విషయంలో కూడా ఏదో ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసి సరిపెడుతున్నారని.. అందుకే 'వి' సినిమా జనాల్లోకి పెద్దగా వెళ్లడం లేదని ఓటీటీ వారు భావిస్తున్నారని ఓటీటీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.