Begin typing your search above and press return to search.

ప్చ్.. మహేష్ మల్టిప్లెక్స్ ప్రారంభం 29న కాదట!

By:  Tupaki Desk   |   27 Nov 2018 5:40 AM GMT
ప్చ్.. మహేష్ మల్టిప్లెక్స్ ప్రారంభం 29న కాదట!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎఎంబీ సినిమాస్ బ్రాండ్ తో మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో కలిసి నిర్మించిన ఈ మల్టిప్లెక్స్ నవంబర్ 29 ప్రారంభిస్తారని చాలారోజులనుండి ప్రచారం సాగుతోంది. ఈ మల్టిప్లెక్స్ ఓపెనింగ్ రజనీకాంత్-శంకర్ చేతుల మీద జరుగుతుందని.. ఈ మల్టిప్లెక్స్ లో మొదటి సినిమాగా '2.0' ను ప్రదర్శిస్తారని వార్తలు వచ్చాయి.

కానీ ఓపెనింగ్ నవంబర్ 29 నుండి డిసెంబర్ 2 వ తేదీకి వాయిదా పడిందని టాక్. అనుమతులు రాకపోవడం ఒక కారణం అయితే.. ఇంటర్నల్ గా ఇంకా కొన్ని ఫినిషింగ్ వర్క్స్ పూర్తి కాలేదట. ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తున్నారు గానీ సమయం తక్కువగా ఉండడంతో అవి 29 వ తేదీలోపు పూర్తయ్యే అవకాశం లేదట. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఎఎంబీ సినిమాస్ ఫోటోలు ఒరిజనల్ కాదని.. డిజైన్ సమయంలో అర్కిటెక్టులు ఇచ్చిన 3D ఫోటోస్ అని సమాచారం. రియల్ ఫోటోలు వచ్చేందుకు మరి కొంత సమయం పడుతుందట.

ఒకవేళ ఓపెనింగ్ వాయిదా పడితే.. డిసెంబర్ 2 న రిలీజ్ అయ్యే భారీ సినిమాలేవీ లేవు. మరి '2.0' తోనే ప్రారంభిస్తారా లేదా మరో మంచి డేట్ కోసం ఎదురు చూస్తారా వేచి చూడాలి. ఈ లెక్కన రజనీ- శంకర్ లు ఓపెనింగ్ కు వచ్చే విషయం కూడా మరుగున పడినట్టే.