Begin typing your search above and press return to search.
అనాధలకు అంబానీల అన్నదానం!
By: Tupaki Desk | 7 March 2019 9:00 AM GMTఅంబానీల ఇంట బ్యాండు బాజా ప్రస్తుతం వేడెక్కిస్తోంది. ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ వివాహానికి ముహూర్తం ఫిక్సయ్యింది. స్విట్జర్లాండ్ - సెయింట్ మోర్టిజ్ లో ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మార్చి 9న వివాహానంతరం 10, 11 తేదీల్లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వలర్డ్ సెంటర్ లో భారీగా రిసెప్షన్ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఈసారి వెడ్డింగ్ కోసం అంబానీ ఏకంగా వెయ్యి కోట్లు కేటాయిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పెళ్లి కోసం షాపింగులు పూర్తయ్యాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి పెళ్లి వస్త్రాలు, భారీగా బంగారు వజ్రాభరణాల్ని అంబానీ ఫ్యామిలీ కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
ఇప్పటికే ప్రీవెడ్డింగ్ పేరుతో అంబానీల అంటిల్లాలో హడావుడి ఓ రేంజులో సాగుతోంది. మరోవైపు అంబానీల అన్నదాన కార్యక్రమాలు వేడెక్కిస్తున్నాయి. లేటెస్టుగా ముంబైలోని పలు ఎన్జీవో ఆర్గనైజేషన్స్ కి అంబానీలు వడ్డనలు చేయడం సర్వత్రా హాట్ డిబేట్ కి కారణమైంది. నవవధువు- వరుడు ఆకాష్ అంబానీ - శ్లోకా మెహతా అనాధ పిల్లలకు వడ్డించారు. అలాగే ముఖేష్ అంబానీ- నీతా అంబానీ జంట.. వడ్డనలు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియోలకు నెటిజనుల నుంచి ప్రశంసలతో పాటు, ట్రోలింగ్ తప్పడం లేదు.
అంబానీల యాక్టివిటీస్ ని కొందరు సమర్ధిస్తే, మరికొందరు దుమ్మెత్తిపోయడం చర్చకు వచ్చింది. వడ్డనలు బావున్నాయి. ఎన్జీవో సేవలు ఓకే. అనాధ పిల్లలకు భోజనం పెట్టడం బావుంది. అయితే రైతుల నోట మట్టి కొట్టి ఇలా చేయడమే ఏం బాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిలయన్స్ అంబానీల వ్యాపార ప్రయోజనాలకు దేశ రైతాంగం విలవిలలాడుతోందని సీపీఐ- సీపీఎం పార్టీలు సహా ప్రతిపక్షవిపక్షాలు నిత్యం విమర్శిస్తుంటాయి. అంబానీల వ్యతిరేకులంతా దీనిపై ఉద్యమమే చేపట్టిన సందర్భం ఉంది. కార్పొరెట్ ని వ్యతిరేకించే కమ్యూనిస్టుల గడబిడకు అయితే కొదవే లేదు. `పేదరికంలో కూరుకుపోయిన రైతు వాళ్ల డెడ్ బాడీల్ని వాళ్లే తింటున్న ధైన్యం ఉంది. అంబానీలు తలుచుకుంటే రైతన్నలకు బోలెడంత సాయం చేయొచ్చు కదా!?` అంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఆ సందర్భాన్ని ఇలా ఎగ్జిబిట్ ఏయడం సరైనదేనా? అన్న ప్రశ్న వేసాడు ఆ నెటిజన్. మరోవైపు వాళ్లు ఏం చేసినా... ఇలా అన్నదానం చేయడం సంతోషించాల్సిన విషయమేనన్న సమర్ధన నెటిజనుల్లో కనిపించింది. ఈ పెళ్లి కోసం ఖర్చు చేసే 1000 కోట్లు దేశంలోని రైతన్నల సేవలకు ప్రకటిస్తే అది అంబానీల గౌరవాన్ని ఎంతో పెంచుతుంది కదా? అన్న వాదనా తెరపైకి తెస్తున్నారు కొందరు.
For Video Click Here