Begin typing your search above and press return to search.
కన్నడ మీటూ చిచ్చును అంబరీష్ చల్లార్చగలరా?
By: Tupaki Desk | 26 Oct 2018 4:17 AM GMTమీటూ ఉద్యమం కారణంగా కన్నడ సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయింది. స్టార్ హీరో అర్జున్ పై హీరోయిన్ శృతిహరిహరన్ చేసిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఇండస్ట్రీలో రెండు వర్గాలు ఉన్నట్లుగా వెళ్లడయ్యింది. శృతి హరిహరన్ కు మద్దతు ఇస్తున్న వారి కంటే అర్జున్ కు మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయినా కూడా శృతి మరియు ఆమె మద్దతుదారులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా అర్జున్ పై పోరాడుతూనే ఉన్నారు. కన్నడ సినిమా పరిశ్రమ ప్రముఖులు అంతా కూడా ఇప్పుడు ఈ విషయానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది.
ఈ వివాదం మరింత ముదిరి, ఇంకా పలువురి పరువు బజారున పడకుండానే జాగ్రత్త పడాలని కన్నడ నిర్మాతల మండలి నిర్ణయించుకుంది. అందుకోసం అర్జున్ మరియు శృతి హరిహరన్ లతో చర్చలు జరిపేందుకు సీనియర్ నటుడు, కన్నడ సినీ ప్రముఖుడు అంబరీష్ ను రంగంలోకి దించారు. ఈయన ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించాడు. కాని శృతి మాత్రం అర్జున్ తో భేటీకి నో చెప్పింది. ఆయన మొహం కూడా చూసేందుకు నాకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది. దాంతో అంబరీష్ ఇద్దరితో వేరు వేరుగా భేటీ అయ్యి, రాజీకి ప్రయత్నిస్తున్నట్లుగా కన్నడ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
శృతి హరిహరన్ వెనుక ఎవరో ఉండి ఈ వ్యాఖ్యలు చేయించారంటూ అర్జున్ సన్నిహితులు కొందరు ఆరోపిస్తున్నారు. ఆదిశగా కూడా సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి, కన్నడ సినిమా పరిశ్రమలో రాజుకున్న మీటూ చిచ్చును చల్లార్చాలని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. అందుకోసం వారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అర్జున్ రాజీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, కాని శృతి మాత్రం రాజీకి ఆసక్తి చూపడం లేదు. ఆమెపై అన్ని వైపుల నుండి ఒత్తిడి తీసుకు వచ్చి రాజీకి ఒప్పించే అవకాశం ఉందని కన్నడ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అంబరీష్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత మేరకు సఫలం అవుతుందో చూడాలి.