Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కు బానిసై భార్యకు నరకం చూపిన స్టార్
By: Tupaki Desk | 13 April 2019 10:00 AM GMTహాలీవుడ్ నటుడు జానీ డిప్ పై ఆయన మాజీ భార్య అంబర్ హర్డ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. జానీ డిప్ నుండి విడాకులు కోరిన ఆమె ఏకంగా 300 కోట్ల రూపాయలను ఆయన నుండి భరణంగా డిమాండ్ చేస్తోంది. అతడి వల్ల తాను శారీరకంగా, మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యానని, అంతే కాకుండా అతడి వల్ల తన పరువు పోయిందని ఆమె పేర్కొంది. డ్రగ్స్ కు అలవాటై అతడు వ్యవహరించిన తీరు నమ్మశక్యంగా లేదంటూ సంచలన ఆరోపణలు చేసింది.
సంవత్సర కాలం జానీ డిప్ తో అంబర్ హర్డ్ రిలేషన్ లో ఉంది. ఆ సమయంలో ఇద్దరు సహజీవనం సాగించారు. అతడితో సహజీవనం ప్రారంభించిన తర్వాత అతడికి ఉన్న చెడు అలవాట్ల గురించి తెలిసింది. డ్రగ్స్ తో పాటు కొన్ని తీసుకోకూడని పదార్థాలు కూడా జానీ తీసుకునే వాడు. ఆ అలవాటు నుండి బయట పడేసేందుకు నేను చాలా ప్రయత్నాలు చేశాను. పలు సార్లు అతడు డ్రగ్స్ కు దూరంగా ఉంటానని హామీ ఇచ్చాడు. కాని ప్రతి సారి కూడా మాట తప్పి డ్రగ్స్ తీసుకునే వాడు.
డ్రగ్స్ తీసుకున్న సమయంలో తన ప్రవర్తనకు పూర్తి విరుద్దంగా ఆయన ప్రవర్తించే వాడు. ఏడాది పాటు నరకం చూపించాడు. డ్రగ్స్ తీసుకున్న సమయంలో జానీ రాక్షసుడిలా ప్రవర్తించే వాడు. పలు సార్లు నా జట్టు పట్టుకుని, గోడకు కొట్టడం, బూతులు తిట్టడం, అసహ్యంగా ప్రవర్తించడం, మూర్ఖంగా మాట్లాడటం చేసేవాడు. ఎన్నో సార్లు గొంతు బిగ్గరగా పట్టుకుని కనీసం గాలి కూడా పీల్చుకునే అవకాశం లేకుండా పిసికేవాడు. అతడితో ఉంటే ఎప్పుడో ఒకసారి చంపేస్తాడనే భయంతో దూరం అవ్వాలని భావిస్తున్నాను. అంతుకే అతడి నుండి తనకు పరిహారం ఇప్పించాలంటూ కోర్టును కోరింది.